Nana Patekar : కార్గిల్ యుద్ధ సమయంలో 60రోజులు భారత సైన్యంతో నానా పటేకర్.. ఆ సమయంలో ఏం జరిగింది? ఆయన చెప్పిన ఆసక్తికర విషయాలు ఇవే..

Nana Patekar : కార్గిల్ యుద్ధ సమయంలో నానా పటేకర్ 60రోజుల పాటు సైన్యంలో పనిచేశారు. ఆ సమయంలో జరిగిన సంఘటనల గురించి పలు సందర్భాల్లో ఆయన వివరించారు.

Nana Patekar worked with Indian Army for 60 days during Kargil War

Nana Patekar : ప్రముఖ బాలీవుడ్ నటుడు నానా పటేకర్ (75) కన్నుమూశారు. గురువారం ఉదయం గుండెపోటుతో ఆయన మరణించారు. నానా పటేకర్ మృతితో సినీ అభిమానులు విషాదంలో మునిగిపోయారు. నటుడిగా ఎన్నో విభిన్న పాత్రల్లో నటిచిన ఆయన.. రైతుల కష్టాలను తీర్చడంలో ముందుంది రైతులకు ఆపదర్భాందవుడిగా నిలిచారు. అంతేకాదు.. భారత సైన్యం అంటే ఆయనకు ఎనలేని అభిమానం. 60 రోజుల పాటు కార్గిల్ యుద్ధంలోనూ ఆయన పాల్గొన్నారు. ఆ సమయంలో జరిగిన ఆసక్తికర విషయాలను ఓ ఇంటర్వ్యూలో నానా పటేకర్ పంచుకున్నారు.

Also Read : Nana Patekar : సినీ పరిశ్రమలో విషాదం.. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు నానా పటేకర్ కన్నుమూత

కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో దేశానికి తనవంతు సాయం చేయాలని నానా పటేకర్ భావించారు. అయితే, సైన్యంలోకి వెళ్లడం అంటే తేలికైన విషయంకాదు. దానికోసం ఎన్నో శిక్షణలు తీసుకోవాలి. అయితే, తాను సైన్యంలోకి వెళ్లాలనే ఆకాంక్షను అప్పటి రక్షణ శాఖ మంత్రి జార్జ్ ఫెర్నాడెజ్ ను కలిసిన సమయంలో తెలిపారు. తాను కమాండో కోర్సు చేశానని, ఆయుధాలను ఉపయోగించడంలోనూ అనుభవం ఉందని, జాతీయ స్థాయిలో రైఫిల్ షూటింగ్ పోటీల్లో పాల్గొని కాంస్య పతకం సాధించిన విషయాన్ని ఫెర్నాండెజ్ కు వివరించారు. దీంతో మీరు సైన్యంలోకి ఎప్పుడు వెళ్లాలనుకుంటున్నారు అని ప్రశ్నించగా.. ఇప్పుడైనా సిద్ధమే అంటూ పటేకర్ తెలిపారు. దీంతో 60రోజుల పాటు కార్గిల్ యుద్ధం సమయంలో ఆర్మీతో కలిసి పనిచేసే అవకాశం పటేకర్ కు దక్కింది.

కార్గిల్ యుద్ధం జరుగుతున్న సమయంలో సైన్యంతో ఎక్కడెక్కడ పనిచేశారు.. తనకు ఎదురైన పలు సంఘటనల గురించి నానా పటేకర్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఆయన సైన్యంతో కలిసి ద్రాస్, లెహ్, కుప్వారా, బారాముల్లా, సొపోరీ తదితర ప్రాంతాల్లో సైనికులతో కలిసి కొంతకాలం పనిచేశారు. ఆ తరువాత కొద్దిరోజులకే క్విక్ రియాక్షన్ టీమ్‌లో సభ్యుడిగా మారారు.

కర్గిల్‌లోని క్లిష్ట పరిస్థితులు నానా పటేకర్‌పై తీవ్ర శారీరక ప్రభావం చూపాయి. తాను శ్రీనగర్‌ చేరుకున్నప్పుడు 76 కిలోల బరువు ఉండగా.. తిరిగి వచ్చేసరికి 56 కిలోలకు తగ్గిపోయానని ఆయన స్వయంగా తెలిపారు. అంటే కేవలం ఆ సమయంలోనే ఏకంగా 20 కిలోల బరువు తగ్గారు. యుద్ధ ప్రాంతంలో సైనికులతో కలిసి గడిపిన రోజులు ఎంత కఠినంగా ఉన్నాయో ఈ ఒక్క విషయం చెబుతోంది.

నానా పటేకర్‌కు భారత సైన్యంపై ఉన్న గౌరవం కర్గిల్‌తోనే ముగియలేదు. సైనికులు, మాజీ సైనికుల కుటుంబాలకు సహాయం చేయడంలోనూ ఆయన ముందుండేవారు. నటుడిగా మూడు జాతీయ అవార్డులు అందుకున్న ఆయన.. తెరపై మాత్రమే కాకుండా నిజ జీవితంలోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు. కర్గిల్ యుద్ధ సమయంలో సైనికులతో కలిసి సేవలందించిన ఆయన కథ.. నానా పటేకర్ వ్యక్తిత్వంలోని మరో గొప్ప కోణాన్ని గుర్తుచేస్తోంది.