Nanded hospital deaths: నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో 8 రోజుల్లో 108 మంది రోగుల మృతి

మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మరణాలకు తెర పడటం లేదు. కేవలం 8 రోజుల్లో 108 మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది....

Nanded hospital

Nanded hospital deaths: మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల మరణాలకు తెర పడటం లేదు. కేవలం 8 రోజుల్లో 108 మంది రోగులు మరణించిన ఘటన సంచలనం రేపింది. సెప్టెంబరు చివరి వారంలో, అక్టోబర్ ప్రారంభం 48 గంటల్లో 31 మంది రోగులు మరణించారు. అనంతరం ఈ ఆసుపత్రిలో రోగుల మరణాలు సాగుతూనే ఉన్నాయి. గడచిన 24 గంటల్లో ఆసుపత్రిలో పసిపాపతో సహా 11 మంది రోగులు మరణించారు. ప్రభుత్వం ఈ మృతుల ఘటనలపై విచారణకు ఆదేశించినా ఫలితం లేకుండా పోయింది.

Also Read :Hamas attack : ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి గురించి భారత సైన్యం ఆరా

గత 24 గంటల్లో 1,100 మందికి పైగా రోగులను వైద్యులు తనిఖీ చేశారు. తాము 191 మంది కొత్త రోగులను ఆసుపత్రిలో చేర్చుకున్నామని ఆసుపత్రి డీన్ చెప్పారు. 24 గంటల్లో సగటు మరణాల రేటు 13గా ఉంది. గతంలో రోగుల మృతికి మందుల కొరత కారణమని వైద్యులు చెప్పారు. కాగా ప్రస్థుతం ఆసుపత్రిలో మందుల కొరత లేదని డీన్ చెబుతున్నా, రోగుల మరణాలు మాత్రం ఆగటం లేదు.

Also Read :Israel war : ఇజ్రాయెల్ చేరిన అమెరికా ఆయుధ విమానం…యుద్ధంలో 3వేలమంది మృతి

మందుల కొరత కారణంగా ఏ రోగి చనిపోలేదని, వారి పరిస్థితి క్షీణించడం వల్ల వారు మరణించారని ఆసుపత్రి డీన్ చెప్పారు. నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 60 మందికి పైగా శిశువులు చేరారని, అయితే శిశువులను చూసుకోవడానికి ముగ్గురు నర్సులు మాత్రమే ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ చెప్పారు. మొత్తం మీద నాందేడ్ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి.