Israel: ఇజ్రాయెల్ చేరిన అమెరికా ఆయుధ విమానం.. యుద్ధంలో 3వేల మంది మృతి
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం బుధవారం నాటికి 5వరోజుకు చేరుకుంది. హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో పలు భవనాలను కూల్చివేసి వాటిని తన నియంత్రణలోకి తీసుకుంది. యుద్ధం తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్ బలగాలు భూదాడికి సమాయత్తం అవుతున్నాయి....

Israel war
Israel Hamas : ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం బుధవారం నాటికి 5వరోజుకు చేరుకుంది. హమాస్ జరిపిన దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ గాజాలో పలు భవనాలను కూల్చివేసి వాటిని తన నియంత్రణలోకి తీసుకుంది. యుద్ధం తీవ్రతరం కావడంతో ఇజ్రాయెల్ బలగాలు భూదాడికి సమాయత్తం అవుతున్నాయి. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఇప్పటివరకు మరణాల సంఖ్య 3వేలకు చేరింది. అత్యంత అధునాతన ఆయుధాలతో కూడిన అమెరికా విమానం బుధవారం ఇజ్రాయెల్ దేశానికి చేరింది. ఈ దాడుల్లో పాలస్థీనా కంటే ఇజ్రాయెల్‌లో ఎక్కువ మంది మరణించారు. హమాస్ ఉగ్ర దాడిని ప్రధాని మోదీ ఖండించారు.
Also Read :UP Cabinet expansion : నవరాత్రి వేళ యూపీ మంత్రివర్గ విస్తరణ.. కొత్తవారికి చోటు
మరో వైపు హమాస్ దాడులు దుర్మర్గపు చర్యగా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఖండించారు. అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ కు సంఘీభావంగా ఆ దేశాన్ని సందర్శించనున్నారు. ఇరాన్‌లోని అత్యున్నత అధికారి అయతుల్లా అలీ ఖమేనీ హమాస్ దాడిలో టెహ్రాన్ ప్రమేయం లేదని స్పష్టం చేశారు. శనివారం ప్రారంభించిన పాలస్తీనా మిలిటెంట్ దాడి తర్వాత ప్రతిపక్ష రాజకీయ నాయకులతో కలిసి అత్యవసర ఐక్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంకీర్ణం అంగీకరించినట్లు ఆయన అధికార లికుడ్ పార్టీ మంగళవారం తెలిపింది.
Also Read : Mexico : మెక్సికోను వణికిస్తున్న లిడియా హరికేన్
ఇజ్రాయెల్ దళాలు గాజాలో తన ప్రతీకార వైమానిక దాడులను కొనసాగించాయి. గాజా సరిహద్దులో ఉన్న దక్షిణ ఇజ్రాయెల్‌ను తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. హమాస్ ఉగ్రవాదుల నుంచి గాజా సరిహద్దు ప్రాంతాలను తమ సైన్యం తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. యునైటెడ్ స్టేట్స్ నుంచి అధునాతన మందుగుండు సామగ్రితో మొదటి విమానం ఇజ్రాయెల్ దేశంలోని నెవాటిమ్ వైమానిక స్థావరంలో దిగినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ధృవీకరించింది. సిరియా భూభాగం నుంచి పాలస్తీనా వర్గం రాకెట్ దాడి చేసిందని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ పేర్కొంది. ఇజ్రాయెల్ దళాలు హమాస్ ఉగ్రవాదుల కేంద్రాలతో సహా భవనాలను కూల్చివేశాయి.