Narayan Rane claims 4 Uddhav faction MLAs ready to switch sides
Maharashtra: ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన ఇక పూర్తిగా ముగిసిపోతుందని కేంద్ర మంత్రి, భారతీయ జనతా పార్టీ నారాయణ రాణె సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేనకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, తొందరలోనే వారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సారధ్యంలో ప్రభుత్వంలో చేరబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు గెట్టు దాటారని, ఇక కొద్ది రోజుల్లో శివసేన అనేది రాష్ట్రంలో ఉండదని నారాయణ రాణె అన్నారు.
ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘శివసేనకు 56 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. కానీ, వాళ్లలో చాలా మంది బయటికి వెళ్లిపోయారు. ఇప్పుడు గట్టిగా ఐదు-ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. వాళ్లు కూడా బయటికి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. మాతో నలుగురు ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు. ఏ సమయంలోనైనా వాళ్లు మాతో చేతులు కలపొచ్చు’’ అని అన్నారు. సుదీర్ఘ కాలం శివసేనలో ఉండి ఉద్ధవ్ థాకరేను పార్టీ అధినేతగా ప్రకటించడాన్ని నిరసిస్తూ అప్పట్లో పార్టీ మారిన నారాయణ రాణె.. మహా వికాస్ అగాఢీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటూ తలపడ్డారు.
శివసేన రెండుగా చీలిన అనంతరం అప్పటి వరకు కామన్ ఎన్నికల గుర్తుగా ఉన్న విల్లు-బాణాన్ని ఎన్నికల సంఘం రద్దు చేసింది. అలాగే ఇరు కూటములకు పార్టీ పేర్లను గుర్తులను కేటాయించింది. ఉద్ధవ్ థాకరే కూటమికి ‘శివసేన ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే’ అని పేరుతో పాటు ‘కాగడ’ గుర్తు కేటాయించింది. ఇక ఏక్నాథ్ షిండే కూటమికి ‘బాలాసాహెబంచి శివసేన’ పేరుతో పాటు ‘రెండు కత్తులు, డాలు’ గుర్తును కేటాయించింది.
China: తిరుగులేని శక్తిగా అవతరించిన జిన్పింగ్.. 10 కీలక విషయాలు