China: తిరుగులేని శక్తిగా అవతరించిన జిన్‭పింగ్.. 10 కీలక విషయాలు

చైనాకు మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికై.. చైనాలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా అవతరించారు జీ జిన్‭పింగ్. పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీని, దేశాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. పదేళ్ల పాలన ముగించి, మూడో విడత అధికారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చైనా రాజకీయాలపై కొన్ని కీలక విషయాలు మీకోసం..

China: తిరుగులేని శక్తిగా అవతరించిన జిన్‭పింగ్.. 10 కీలక విషయాలు

10 points about Xi Jinping and china politics

China: చైనాకు మూడవసారి అధ్యక్షుడిగా ఎన్నికై.. చైనాలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తివంతమైన నాయకుడిగా అవతరించారు జీ జిన్‭పింగ్. పార్టీ కార్యకర్త స్థాయి నుంచి ఒక్కో మెట్టు ఎక్కుతూ పార్టీని, దేశాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకున్నారు. పదేళ్ల పాలన ముగించి, మూడో విడత అధికారంలోకి అడుగుపెట్టిన సందర్భంగా చైనా రాజకీయాలపై కొన్ని కీలక విషయాలు మీకోసం..

1. అమెరికాలో లాగ చైనాలో కూడా అధ్యక్ష పదవి రెండు సార్లకు మాత్రమే అవకాశం ఉంటుంది. కానీ రెండవసారి చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం 2018లో ఈ విధానాన్ని జిన్‭పింగ్ రద్దు చేశారు.
2. చైనాలో కమ్యూనిస్ట్ పార్టీని స్థాపించిన మావో జెడాంగ్ తర్వాత అత్యధిక సార్లు చైనాకు అధ్యక్షుడు అయిన నేతగా, చైనాలో అత్యంత శక్తివంతమైన నేతగా జిన్‭పింగ్ అవతరించారు.
3. జిన్‭పింగ్ 2012లో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2013 మార్చి 14న చైనా అధ్యక్షుడిగా మొదటిసారి బాధ్యతలు చేపట్టారు.
4. కమ్యూనిస్ట్ పార్టీ 20వ జాతీయ మహాసభలకు హాజరయ్యేందుకు వచ్చిన చైనా మాజీ అధ్యక్షుడు హూ జింటావోను భద్రతా సిబ్బంది చేత సమావేశం నుంచి బయటికి పంపడం వివాదాస్పదమైంది.
5. 2,300 మందితో కూడా పార్టీ బృందం ఆదివారం సాగిన కాంగ్రెస్‭లో తన పదేళ్ల పాలనకు సంబంధించి జిన్‭పింగ్ ఇచ్చిన నివేదికను ఆమోదించారు (వాస్తవానికి ఇది రబ్బరు స్టాంపు లాంటిది).
6. పార్టీ 20వ జాతీయ మహాసభల్లో పార్టీ నూతన పొలిట్ బ్యూరోను ఏర్పాటు చేశారు. అయితే 7గురు సభ్యులు ఉన్న ఇందులో ఒక్క మహిళ కూడా లేరు.
7. కమ్యూనిస్టు పార్టీలో నంబర్ 2గా ఉన్న చైనా ప్రధాని లీ కెకియాంగ్‌ను పొలిట్ బ్యూరో నుంచి జిన్‭పింగ్ తొలగించారు.
8. కొవిడ్ నియంత్రణపై జిన్‭పింగ్ తీసుకున్న చర్యలు, ప్రభుత్వ విధానాలు చైనీయులను బాగా ఇబ్బంది పెట్టాయి.
9. 3వ సారి అధ్యక్షుడిగా ఎన్నికవ్వడానికి ముందే జిన్‭పింగ్‭పై వ్యతిరేకత పెరిగింది. ప్రభుత్వ వ్యతిరేకత నిషేధించడం వల్ల టాయిలెట్ల ద్వారా చైనీయులు రహస్య నిరసన చేపట్టారు.
10. పొలిట్ బ్యూరో స్టాండింగ్ కమిటీకి తదుపరి తన వారసుడిని జిన్‭పింగ్ ప్రకటిస్తారా అనే ప్రశ్న అలాగే మిగిలి ఉంది.

China: ఒక్క మహిళ కూడా లేకుండా చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో.. 25 ఏళ్లలో ఇదే మొదటిసారి