China: ఒక్క మహిళ కూడా లేకుండా చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో.. 25 ఏళ్లలో ఇదే మొదటిసారి

అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. ఇవాళ స్టాండింగ్‌ కమిటీ షీ జిన్ పింగ్ పేరును తమ నాయకుడిగా అధికారికంగా ప్రకటించింది. కాగా, కమ్యూనిస్టు పార్టీలో నంబర్ 2గా ఉన్న చైనా ప్రధాని, పొలిట్‌బ్యూరో, స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు లీ కెకియాంగ్‌కు షీ జిన్ పింగ్ ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.

China: ఒక్క మహిళ కూడా లేకుండా చైనా కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్ బ్యూరో.. 25 ఏళ్లలో ఇదే మొదటిసారి

No Woman In China Communist Party New Top Body

China: చైనా కమ్యూనిస్ట్ పార్టీ తాజా పొలిట్ బ్యూరోను ఆదివారం విడుదల చేశారు. కాగా, ఇందులో ఒక్కరంటే ఒక్క మహిళ కూడా లేకపోవడం గమనార్హం. గడిచిన 25 ఏళ్ల కాలంలో ఇలా ఒక్క మహిళ లేకుండా పొలిట్ బ్యూరో ఏర్పాటు కావడం ఇదే మొదటిసారి. ఇక గత పొలిట్ బ్యూరోలో ఒకే ఒక్క మహిళ ఉన్నారు. సున్ చున్లన్ అనే మహిళ గత పొలిట్ బ్యూరోలో సభ్యులుగా ఉన్నారు. చైనా అధ్యక్షుడు జిన్‭పింగ్ తాజా పొలిట్ బ్యూరోను ప్రకటించారు. ఇందులో మొత్తం ఏడుగురు సభ్యులు ఉన్నారు. కాగా, ఇందులో ఇద్దరు అతడి మాజీ సెక్రెటరీలు, మిగతా వారు ఆయనకి పూర్తి విశ్వాసులు, అత్యంత సన్నిహితులు ఉన్నారు. అత్యంత సన్నిహితుడైన డింగ్ జూజియాంగ్, పార్టీ గౌంగ్డాంగ్ చీఫ్ లీ జీ, పార్టీ బీజింగ్ చీఫ్ కైకీ కూడా ఇందులో సభ్యులుగా ఉన్నారు.

ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా, చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యకదర్శిగా జిన్‭పింగ్ ఎన్నికయ్యారు. ఈ పదవుల్లో వరుసగా మూడుసార్లు ఎన్నికైన నేతగా ఆయన రికార్డ్ సృష్టించారు. ఇంతకు ముందు ఈ రికార్డ్.. కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడైన మావో జెడాంగ్ పేరుపై మాత్రమే ఉండేది. జిన్ పింగ్ 2012 నవంబరు 15 నుంచి చైనా కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. చైనా అధ్యక్షుడిగా 2013 మార్చి 14న మొదటిసారి బాధ్యతలు చేపట్టారు. రెండోసారి కూడా ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. వచ్చే ఏడాది మార్చిలో మూడోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తారు.

IND vs PAK T20 Match: వర్షం ముప్పు తప్పినట్లే..! మరికొద్ది సేపట్లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్..

ఆ తర్వాత అధ్యక్షుడిగా ఐదేళ్లపాటు కొనసాగనున్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ 20వ జాతీయ మహాసభల్లో ఈ మేరకు తీర్మానం చేశారు. ఇవాళ స్టాండింగ్‌ కమిటీ షీ జిన్ పింగ్ పేరును తమ నాయకుడిగా అధికారికంగా ప్రకటించింది. కాగా, కమ్యూనిస్టు పార్టీలో నంబర్ 2గా ఉన్న చైనా ప్రధాని, పొలిట్‌బ్యూరో, స్టాండింగ్‌ కమిటీ సభ్యుడు లీ కెకియాంగ్‌కు షీ జిన్ పింగ్ ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.

అంతేగాక, తనకు పోటీగా నిలిచే అవకాశం ఉన్న మరో ముగ్గురు నేతలను కూడా ఆయన తమ పార్టీ కేంద్ర కమిటీ నుంచి తప్పించారు. పార్టీ సెంట్రల్ కమిటీ 25 మంది నాయకులతో కొత్త పొలిటికల్ బ్యూరోను ఎన్నుకుంది. నిజానికి చైనా అధ్యక్షుడిగా నేత 68 ఏళ్ల వయసు వచ్చే వరకే కొనసాగాలి. ఇప్పుడు షీ జిన్ పింగ్ కి 69 ఏళ్లు. తానే చైనా అధ్యక్షుడిగా ఉండాలన్న దురాశతో జిన్ పింగ్ 2018లో పార్టీ రాజ్యాంగాన్ని సవరించారు. మూడోసారి కూడా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గాన్ని సుగమం చేసుకున్నారు.

Munugode bypoll: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియోపై కాంగ్రెస్ సీరియస్.. క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు