IND vs PAK T20 Match: వర్షం ముప్పు తప్పినట్లే..! మరికొద్ది సేపట్లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్..

గత రెండురోజులు మెల్‌బోర్న్‌లో వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయంసైతం అక్కడ మేఘావృతమై ఉంది. అయితే, మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం స్పష్టంగా ఉండటంతో 40 ఓవర్లు ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

IND vs PAK T20 Match: వర్షం ముప్పు తప్పినట్లే..! మరికొద్ది సేపట్లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్..

India vs Pakistan

IND vs PAK T20 Match: టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భాగంగా ఆదివారం మరికొద్దిసేపట్లో మెల్‌బోర్న్ స్టేడియంలో దాయాదుల సమరం ప్రారంభం కాబోతోంది. గత రెండురోజులు మెల్‌బోర్న్‌లో వర్షాలు కురిశాయి. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయంసైతం అక్కడ మేఘావృతమై ఉంది. అయితే, మధ్యాహ్నం నుంచి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఆకాశం స్పష్టంగా ఉండటంతో 40 ఓవర్లు ఎలాంటి అంతరాయం లేకుండా మ్యాచ్ జరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

India vs Pakistan T20 Match: నేడు దాయాది జట్ల మధ్య పోరు.. పొంచిఉన్న వర్షం ముప్పు.. వ్యూహం మార్చనున్న భారత్..

మరోవైపు హైవోల్టేజ్ మ్యాచ్ ను ప్రత్యక్ష్యంగా వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు భారీగా మెల్ బోర్న్ స్టేడియంకు చేరుకుంటున్నారు. ఈ స్టేడియంలో 90వేల సీట్ల కెపాసిటీ ఉంది. సుమారు లక్షమంది వరకు మ్యాచ్ ను స్టేడియం నుంచి వీక్షించే అవకాశం ఉంది. ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లా బుక్ అయ్యాయి. మధ్యాహ్నం నుంచే స్టేడియం వద్దకు క్రికెట్ అభిమానులు భారీగా చేరుకున్నారు. ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం రాత్రి 7గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

స్టేడియం వద్దకు భారీగా చేరుకున్న భారత్ అభిమానులు నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ సందడి చేశారు. అయితే మధ్యమధ్య వాతావరణం మేఘావృతం అవుతుండటంతో అభిమానుల్లో కొంత ఆందోళన నెలకొంది. హైవోల్టేజ్ మ్యాచ్ కు వర్షంముప్పు ఉండటంతో సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు. వర్షం వచ్చినా అందులో ఇరు జట్ల క్రీడాకారులకు స్విమ్మింగ్ పోటీలు పెట్టాలంటూ సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు.