Munugode bypoll: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియోపై కాంగ్రెస్ సీరియస్.. క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు

కాంగ్రెస్ తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలోని మునుగోడులో ఉప ఎన్నిక వేళ కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన ఓ ఆడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఓ కాంగ్రెస్  నేతతో వెంకట్ రెడ్డి ఫోనులో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికే ఓటేయాలని చెబుతున్నట్లు ఉంది.

Munugode bypoll: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియోపై కాంగ్రెస్ సీరియస్.. క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు

Congress MP Komatireddy Venkata Reddy hunger strike

Munugode bypoll: కాంగ్రెస్ తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. తెలంగాణలోని మునుగోడులో ఉప ఎన్నిక వేళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి సంబంధించిన ఓ ఆడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఓ కాంగ్రెస్  నేతతో వెంకట్ రెడ్డి ఫోనులో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డికే ఓటేయాలని చెబుతున్నట్లు ఉంది.

దీంతో వెంకట్ రెడ్డి ఫోన్ కాల్ పై వివరణ ఇవ్వాలని ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా, పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డికి సాయం చేయాలని ఫోనులో కాంగ్రెస్ కార్యకర్తకు వెంకట్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.

నియోజక వర్గంలో చాలా మందిని రాజగోపాల్ రెడ్డి ఆదుకున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ను తాను అధికారంలోకి తీసుకువస్తానని, కాబోయే టీపీసీసీ చీఫ్ తానేనని వెంకట్ రెడ్డి ఫోనులో చెప్పారు. చివరకు దీనిపై స్పందిస్తూ ఆ ఫోన్ 2014 ఎన్నికల నాటిదని చెప్పుకొచ్చారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..