Modi Birthday: ప్రధాని హోదాలో 10వ సారి పుట్టినరోజు వేడుక.. ఏ ఏడాది ఎలా జరుపుకున్నారో తెలుసా?

గత ఏడాది మోదీ 72వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్‌లోని..

Narendra Modi

Modi Birthday – In the last 10 years: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబరు 17న 73వ పుట్టినరోజు వేడుక జరుపుకుంటున్నారు. ప్రతి ఏటా పుట్టినరోజు సందర్భంగా మోదీ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రధాని హోదాలో ఆయన ఏయే ఏడాది ఎలా పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారో చూద్దాం..

2014, సెప్టెంబరు 17న
ప్రధాని హోదాలో మోదీ జరుపుకున్న తొలి పుట్టినరోజు ఇది. 64వ పుట్టినరోజు సందర్బంగా తన తల్లి హీరాబెన్ మోదీ ఆశీర్వాదాన్ని తీసుకున్నారు మోదీ. ఆ సమయంలో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మూడు రోజుల భారత పర్యటనలో ఉన్నారు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

2015, సెప్టెంబరు 17న
మోదీ తన 65వ జన్మదినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలో మిలటరీ ఎగ్జిబిషన్ శౌర్యాంజలిని మోదీ సందర్శించుకున్నారు. 1965 భారత్-పాక్ యుద్ధానికి గోల్డెన్ జూబ్లీ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ కు మోదీ వెళ్లారు.

2016, సెప్టెంబరు 17న


Narendra Modi

ప్రధాని మోదీ తన 66వ పుట్టినరోజు సందర్భంగా గుజరాత్ వెళ్లి తన తల్లి హీరాబెన్ మోదీ ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం నౌసారీకి వెళ్లి వికలాంగులకు అవసరమైన పరికరాలు అందించే కార్యక్రమంలో పాల్గొన్నారు

2017, సెప్టెంబరు 17న
సర్దార్ సరోవర్ డ్యామ్ ప్రాజెక్టును ప్రధాని మోదీ ఈ రోజే దేశానికి అంకితం ఇచ్చారు. దేశం వృద్ధి చెందుతోందనడానికి ఇదో చిహ్నంగా నిలుస్తుందని మోదీ చెప్పారు.

2018, సెప్టెంబరు 17న


Narendra Modi

ప్రధాని మోదీ తన 68వ పుట్టినరోజు సందర్భంగా తన పార్లమెంట్ నియోజక వర్గం వారణాసికి వెళ్లారు. కాశీ విశ్వనాథ మందిరంలో పూజల్లో పాల్గొన్నారు. అనంతరం కాశీ విద్యాపీఠ్ బ్లాక్ లోని నరౌర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులను మోదీ కలిశారు.

2019, సెప్టెంబరు 17న


Narendra Modi

గుజరాత్ వెళ్లిన మోదీ తన తల్లి హీరాబెన్ ఆశీర్వాదాలు తీసుకున్నారు. అనంతరం కెవాదియాలో నమామీ నర్మదా కార్యక్రమంలో పాల్గొన్నారు.

2020, సెప్టెంబరు 17న
దేశంలో కరోనా విజృంభించడంతో పుట్టినరోజు వేడుకలకు మోదీ దూరంగా ఉన్నారు. అయితే, బీజేపీ మాత్రం సేవా సప్త పేరుతో ఆ రోజున పేదలకు రేషన్ అందించింది. రక్తదాన శిబిరాలు నిర్వహించింది.

2021, సెప్టెంబరు 17న
కరోనా నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు చేయలేదు. అయితే, ఆ రోజుతో దేశంలో వినియోగించిన కరోనా వ్యాక్సిన్ డోసుల సంఖ్య 2.26 కోట్లకు చేరింది. మోదీకి వచ్చిన గిఫ్టుల వేలం నిర్వహించారు.

2022, సెప్టెంబరు 17న

Narendra Modi

గత ఏడాది మోదీ 72వ పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్కులో వదిలే కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. ఆ సమయంలో వాటి ఫొటోలను స్వయంగా తీశారు.

2023, సెప్టెంబరు 17న

ఇదే రోజున విశ్వకర్మ జయంతి సందర్భంగా మోదీ విశ్వకర్మ యోజనను ప్రారంభిస్తున్నారు. తల్లి లేకుండా మోదీ జరుపుకుంటున్న తొలి పుట్టినరోజు ఇది.

Modi Birthday: తల్లిలేకుండా జరుపుకుంటున్న మొట్టమొదటి పుట్టినరోజు.. 72 ఏళ్లపాటు హీరాబెన్ మోదీతో..