మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్న దేశాధినేతలు వీరే.. ఢిల్లీలో హైఅలర్ట్
Narendra Modi oath-taking ceremony: ప్రత్యేక ఆహ్వానితులుగా వందే భారత్ లోకో పైలెట్లు, పారిశుధ్య కార్మికులు, సెంట్రల్ విస్టా కార్మికులు, తదితరులు..
- T Venkateshwarlu
- Updated on- June 8, 2024 / 05:50 PM IST
PM modi
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ఆదివారం సాయంత్రం 7.15 గంటలకి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మోదీతో పాటు మంత్రి మండలి సభ్యులు ప్రమాణం చేస్తారు. రాష్ట్రపతి భవన్ లాన్స్ లో ఈ కార్యక్రమం జరగనుంది. దాదాపు 10 వేల మంది హాజరుకానున్నారు.
వివిధ దేశాధి నేతలు కూడా హాజరు అవుతారు. ప్రత్యేక ఆహ్వానితులుగా వందే భారత్ లోకో పైలెట్లు, పారిశుధ్య కార్మికులు, సెంట్రల్ విస్టా కార్మికులు, తదితరులు వస్తున్నారు. ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. 9, 10 తేదీల్లో నో ఫ్లై జోన్‌గా సెంట్రల్ ఢిల్లీ ఉండనుంది. అక్కడ హోటళ్ల వద్ద భారీ భద్రతా ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి భవన్ వద్ద 2,500 మంది పోలీసులు సహా ఐదు కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు.
ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్న దేశాధినేతలు
- శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే
- మాల్దీవుల అధ్యక్షుడు డా. మొహమ్మద్ ముయిజ్జు
- సీషెల్స్ వైస్ ప్రెసిడెంట్ అహ్మద్ అఫీఫ్
- బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా
- మారిషస్ ప్రధాన మంత్రి ప్రవింద్ కుమార్ జుగ్నాథ్
- నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’
- భూటాన్ ప్రధాన మంత్రి షెరింగ్ టోబ్గే
Also Read: నితిన్ గడ్కరీని చూడగానే ఆయన మనవరాళ్లు ఏం చేశారో చూడండి
