Viral Video: నితిన్ గడ్కరీని చూడగానే ఆయన మనవరాళ్లు ఏం చేశారో చూడండి

Nitin Gadkari: నితిన్ గడ్కరీ భార్య కంచన్ గడ్కరీతో కలిసి వారి మనవరాళ్లు కారులో నుంచి దిగడం..

Viral Video: నితిన్ గడ్కరీని చూడగానే ఆయన మనవరాళ్లు ఏం చేశారో చూడండి

Nitin Gadkari Shares Video Of Granddaughters Visit

Updated On : June 8, 2024 / 5:00 PM IST

బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీని ఆయన మనవరాళ్లు హత్తుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అనుకోని విధంగా ఆనందం దక్కిదంటూ ఈ వీడియోను నితిన్ గడ్కరీ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.

శనివారం తన మనవరాళ్లు తనను చూడడానికి వచ్చారని తెలిపారు. నితిన్ గడ్కరీ భార్య కంచన్ గడ్కరీతో కలిసి వారి మనవరాళ్లు కారు నుంచి దిగడం వీడియోలో చూడవచ్చు. ఆ పిల్లలంతా నితిన్ గడ్కరీ వద్దకు పరుగులు తీశారు. పిల్లలను చూడగానే గడ్కరీ మురిసిపోయారు.

కాగా, మహారాష్ట్రలోని నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గడ్కరీ వరుసగా మూడోసారి గెలిచారు. తాజా ఎన్నికల్లో ఆయన నాగ్‌పూర్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ ప్రత్యర్థిపై 1,37, 603 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ సందర్భంగానే గడ్కరీ తన కుటుంబ సభ్యులతో పాటు నియోజక వర్గ నేతలను కూడా తన నివాసంలో కలిశారు. తన నియోజక వర్గ ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు నితిన్ గడ్కరీ ధన్యవాదాలు తెలిపారు.

Also Read: ఎవరికి దక్కేనో..? రెండ్రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ చీఫ్ నియామకం