Bharat Jodo Yatra: ఘోర తప్పిదం.. భారత జాతీయ గీతానికి బదులు నేపాల్ జాతీయ గీతం ప్లే చేసిన కాంగ్రెస్

రాహుల్ సహా ఎవరూ ఈ విషయాన్ని గమనించకుండా దాదాపు అర నిమిషం అలాగే నిల్చున్నారు. ఇంతలో గీతం మనది కాదని తేరుకుని, ఆ పాటను వెంటనే ఆపేశారు. ఆ తర్వాత జగ గణ మన ప్లే చేశారు. ఇందులో మరో విశేషం ఏంటంటే, నేపాల్ జాతీయ గీతాన్ని ఆపగానే కొందరు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు సైతం చేశారు.

Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో ఘోర తప్పిదం చోటు చేసుకుంది. జాతీయ గీతం వేయమని రాహుల్ గాంధీ కోరగా.. నేపాల్ జాతీయ గీతాన్ని ప్లే చేశారు కాంగ్రెస్ నేతలు. నేపాల్ జాతీయ గీతం ప్లే కావడం ప్రారంభం కాకముందే రాహుల్ గాంధీ సహా పలువురు కాంగ్రెస్ నేతలు గౌరవంగా నిల్చున్నారు. జగ గణ మన కాకుండా ఇంకేదో శబ్దం వినిపిస్తోంది. దాదాపుగా అరనిమిషం వరకు దాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. కాంగ్రెస్ చేసిన తప్పిదం ఎలాంటిదైనా, బీజేపీకి మాత్రం పెద్ద అవకాశంగా లభించింది. అంతే, ఇక రాహుల్ గాంధీపై కాంగ్రెస్ పార్టీపై బీజేపీ నేతలు పెద్ద ఎత్తున విరుచుకుపడుతున్నారు.

భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. గురువారం యాత్రలో భాగంగా ఓ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కాంగ్రెస్ నేత ఒకరు మాట్లాడుతుండగా రాహుల్ మైక్ దగ్గరికి వచ్చి జాతీయ గీతం వేయాలని కోరారు. వెంటనే నేపాల్ జాతీయ గీతం వేశారు. రాహుల్ సహా ఎవరూ ఈ విషయాన్ని గమనించకుండా దాదాపు అర నిమిషం అలాగే నిల్చున్నారు. ఇంతలో గీతం మనది కాదని తేరుకుని, ఆ పాటను వెంటనే ఆపేశారు. ఆ తర్వాత జగ గణ మన ప్లే చేశారు. ఇందులో మరో విశేషం ఏంటంటే, నేపాల్ జాతీయ గీతాన్ని ఆపగానే కొందరు ‘భారత్ మాతా కీ జై’ అంటూ నినాదాలు సైతం చేశారు.

తమ తప్పును వెంటనే సరిద్దుకుని జాతీయ గీతం అయితే రాహుల్ సహా కాంగ్రెస్ నేతలు ఆలపించారు. కానీ, అధికార పార్టీకి చాలా బలంగా దొరికిపోయారు. జాతీయ గీతాన్ని అవమానించారంటూ బీజేపీ సహా ఇతర పార్టీలు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారు. సదరు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Madhu Srivastava: మీ కాలర్ పట్టుకున్నోడిని ఇంటికెళ్లి కాల్చి పారేస్తా.. బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు