Another silver medal for Jeevanji Deepti : జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్స్ లో తెలంగాణ అమ్మాయి జీవంజి దీప్తి రెండో రజత పతకాన్ని కైవసం చేసుకుంది. పోటీల చివరి రోజైన బుధవారం నిర్వహించిన అండర్-18 బాలికల 200 మీ. పరుగులో ఆమె రెండో స్థానంలో నిలిచింది. 24.67 సెకన్లలో ఆమె గమ్యాన్ని చేరుకున్నారు.
అండర్-18 బాలుర 200 మీ. పరుగులో తెలంగాణ కుర్రాడు అనికేత్ చౌదరి వెండి పతకం సొంతం చేసుకున్నాడు. 21.71 సెకన్లలో అతను గమ్యాన్ని చేరుకున్నారు. మరోవైపు అండర్-20 పరుషుల 200 మీ. పరుగులో ఏపీ అథ్లెట్ షణ్ముగ శ్రీనివాస్ 21.60 సెకన్లలో లక్ష్యాన్ని అందుకుని కాంస్య పతకం గెలిచారు.
అండర్-20 పురుషుల విభాగంలో ఏపీ అబ్బాయి యశ్వంత్ కుమార్ (110మీ.హార్డిల్స్), అండర్-18 బాలికల విభాగంలో తెలంగాణ అమ్మాయి నందిని (100 మీ. హార్డిల్స్) ఉత్తమ అథ్లెట్లుగా అవార్టులు దక్కించుకున్నారు. ఈ ఛాంపియన్ షిప్ లో మొత్తం 8 పతకాలతో తెలంగాణ 12వ స్థానంలో నిలిచింది. 5 పతకాలతో ఏపీ 15వ స్థానాన్ని దక్కించుకుంది.