భారత్‌ బంద్‌కు పిలుపు.. 25 కోట్ల మంది పాల్గొంటారన్న కార్మిక సంఘాల వేదిక

బ్యాంకింగ్‌, ఇన్సురెన్స్‌, తపాలా, బొగ్గు గనులు, జాతీయ రహదారులతో పాటు నిర్మాణ రంగాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది పాల్గొంటారని వివరించింది.

దేశంలోని 10 కార్మిక సంఘాల వేదిక బుధవారం భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చింది. కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక, దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని ఆరోపించింది.

Also Read: డెలివరీ డేట్‌ను ప్లాన్‌ చేసుకుని సిజేరియన్ చేయించుకుంటే పిల్లలకు రక్త క్యాన్సర్‌ ముప్పు

కేంద్ర సర్కారు కార్పొరేట్‌ అనుకూల విధానాలను అవలంబిస్తోందని చెప్పింది. ఈ నేపథ్యంలో కేంద్ర సర్కారు తీరును నిరసిస్తూ ఈ బంద్‌కు పిలుపునిచ్చినట్లు ఓ ప్రకటనలో పేర్కొంది. భారత్‌ బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేసింది.

ఇందులో బ్యాంకింగ్‌, ఇన్సురెన్స్‌, తపాలా, బొగ్గు గనులు, జాతీయ రహదారులతో పాటు నిర్మాణ రంగాలకు చెందిన దాదాపు 25 కోట్ల మంది పాల్గొంటారని వివరించింది. అలాగే, రైతులు, గ్రామీణ ప్రాంత కార్మికులు సైతం ఇందులో పాల్గొంటారని చెప్పింది.