Navjot Sidhu : 24 గంటలుగా జైల్లో ఆహారం తీసుకోని నవజోత్ సిద్ధూ.. ఏమైందంటే?

Navjot Sidhu : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. పంజాబ్‌లోని పాటియాలా సెంట్రల్ జైలుకు వెళ్లారు. 1988 డిసెంబర్ 27 నాటి కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది.

Navjot Sidhu : 24 గంటలుగా జైల్లో ఆహారం తీసుకోని నవజోత్ సిద్ధూ.. ఏమైందంటే?

Navjot Sidhu Hasn't Eaten In Nearly 24 Hours At Patiala Jail, Says His Lawyer

Updated On : May 21, 2022 / 10:23 PM IST

Navjot Sidhu : పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. పంజాబ్‌లోని పాటియాలా సెంట్రల్ జైలుకు వెళ్లారు. 1988 డిసెంబర్ 27 నాటి కేసులో సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. ఈ క్రమంలో జైలుకు వెళ్లిన సిద్ధూ 24 గంటలు అవుతుంది. అయితే సిద్ధూ జైల్లో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవడం లేదట..

24గంటలుగా ఎలాంటి ఆహారం కూడా తీసుకోలేదని ఆయన తరపు న్యాయవాది హెచ్‌పీఎస్ వర్మ పేర్కొన్నారు. కోర్టులో లొంగిపోయిన తర్వాత సిద్ధూను పోలీసులు జైలుకు తరలించారు. జైలు అధికారులు రాత్రి భోజనం వడ్డించగా అరోగ్య పరమైన కారణాలతో సిద్ధూ తినలేదని వర్మ తెలిపారు.

Navjot Sidhu Hasn't Eaten In Nearly 24 Hours At Patiala Jail, Says His Lawyer (1)

Navjot Sidhu Hasn’t Eaten In Nearly 24 Hours At Patiala Jail, Says His Lawyer 

తన ఆరోగ్యం దృష్ట్యా మంచి ఆహారాన్ని అందించాల్సిందిగా జైలు అధికారులను ఆదేశించాలని పాటియాలా కోర్టును లాయర్ వర్మ అభ్యర్థించారు. సిద్ధూ తరపు లాయర్ విజ్ఞప్తిపై అధికారుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు. జైలు అధికారుల కోసం తాను కోర్టులోనే ఉన్నానని.. అయినా ఎవరూ రాలేదంటూ వర్మ అసహనం వ్యక్తం చేశారు.

Read Also : Bengaluru Crime : బెంగళూరులో కారు బీభత్సం.. పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ వీడియో..!