Rahul and Pawar: వర్షంలో తడుస్తూ రాహుల్ చేసిన ప్రసంగాన్ని శరద్ పవార్‭ ర్యాలీతో పోల్చిన ఎన్సీపీ

ఈ సందర్భాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్‭తో గుర్తు చేసుకుంటున్నారు కొంత మంది. 2019లో సతారా లోక్‭సభా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంలో పవార్ వర్షంలో తడుస్తూనే ప్రచారం నిర్వహించారు. అప్పుడు పవార్ వీడియోలు, ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. కాగా, తాజాగా రాహుల్‭కు ఎదురైన సందర్భం కూడా అచ్చం అలాగే కనిపిస్తోందని అంటున్నారు

Rahul and Pawar: భారత్ జోడో యాత్రలో భాగంగా ప్రస్తుతం కర్ణాటకలో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీ.. ఆదివారం మైసూరులో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే కార్యక్రమంలో రాహుల్ మాట్లాడుతుండగా వర్షం వచ్చింది. అయినప్పటికీ తన ప్రసంగాన్ని రాహుల్ కొనసాగించారు. వర్షంలోనే కార్యక్రమాన్ని ముగించారు. కాగా, వర్షంలో తడుస్తూ ప్రసంగిస్తున్న రాహుల్ గాంధీ వీడియోలు, ఫొటోలు నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అయితే ఈ సందర్భాన్ని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ శరద్ పవార్ ఒక సందర్భంలో నిర్వహించిన ర్యాలీతో పోల్చుకుంటున్నారు కొంత మంది. 2019లో సతారా లోక్‭సభా నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక సందర్భంలో పవార్ వర్షంలో తడుస్తూనే ప్రచారం నిర్వహించారు. అప్పుడు పవార్ వీడియోలు, ఫొటోలు బాగా వైరల్ అయ్యాయి. కాగా, తాజాగా రాహుల్‭కు ఎదురైన సందర్భం కూడా అచ్చం అలాగే కనిపిస్తోందని అంటున్నారు. ఇకపోతే సతారా లోక్‭సభా జరిగిన ఉప ఎన్నికలో ఎన్సీపీ విజయం సాధించింది. అయితే రాహుల్ సైతం రానున్న రోజుల్లో విజయం సాధించొచ్చని అంటున్నారు.

Mangalyaan quietly bids goodbye: మంగళ్‌యాన్‌లో ఇంధనం అయిపోయింది.. బ్యాటరీ కూడా పనిచేయట్లేదు: ఇస్రో వర్గాలు

ఈ విషయమై ఎన్సీపీ జాతీయ అధికారి ప్రతినిధి క్లీడే క్రాస్టో తన ట్విట్టర్ ఖాతాలో వర్షంలో తడుస్తూ ప్రసంగిస్తున్న పవార్, రాహుల్ ఫొటోలను షేర్ చేస్తూ ‘‘ఇంతకు సమయమే రుజువు చేసింది. మళ్లీ సమయమే రుజువు చేస్తుంది. విజయానికి సంకేతాలిస్తూ ఆ దేవుడే వర్షపు చినుకుల ద్వారా దీవెనలు అందిస్తాడు’’ అని ట్వీట్ చేశారు.

ఎన్సీపీ నేత ఉదయన్‭రాజే భోసలే.. ఎన్సీపీని వీడి బీజేపీలో చేరడంతో సతారా నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఏర్పడింది. కాగా ఈ ఎన్నికల్లో భోసలేను ఎన్సీపీ అభ్యర్థి శ్రీనివాస్ పాటిల్ 87,000 ఓట్ల తేడాతో ఓడించారు. ఈ విజయాన్ని పవార్ విజయమంటూ అప్పట్లో అనేక ప్రశంసలు వచ్చాయి.

Dattatreya Hosabale: దేశంలో పెరుగుతోన్న నిరుద్యోగం, పేదరికంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్

ట్రెండింగ్ వార్తలు