Mangalyaan quietly bids goodbye: మంగళ్‌యాన్‌లో ఇంధనం అయిపోయింది.. బ్యాటరీ కూడా పనిచేయట్లేదు: ఇస్రో వర్గాలు

మంగళయాన్.. ఇస్రో కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా మరింత పెంచి, ప్రపంచ దృష్టిని భారత్ వైపునకు మళ్లించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఇది. ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం) ప్రయోగాన్ని 2013 నవంబరు 5న ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఆ తదుపరి సంవత్సరం సెప్టెంబరు 24న అది విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి చేరింది. కేవలం ఆరు నెలలు పాటు మాత్రమే ఇస్రో దీన్ని రూపొందించగా అది ఇప్పటివరకు పనిచేసి ఆశ్చర్యపర్చింది. మరో నెల రోజులు గడిస్తే మంగళయాన్ ప్రయోగం పూర్తై దాదాపు తొమ్మిది ఏళ్లు గడుస్తుంది. అయితే, ఇప్పుడు మంగళయాన్ తన ప్రస్థానానికి ముగింపు పలుకుతోంది.

Mangalyaan quietly bids goodbye: మంగళ్‌యాన్‌లో ఇంధనం అయిపోయింది.. బ్యాటరీ కూడా పనిచేయట్లేదు: ఇస్రో వర్గాలు

Mangalyaan quietly bids goodbye

Mangalyaan quietly bids goodbye: మంగళయాన్.. ఇస్రో కీర్తిని ప్రపంచ వ్యాప్తంగా మరింత పెంచి, ప్రపంచ దృష్టిని భారత్ వైపునకు మళ్లించిన ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ఇది. ఈ మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎంవోఎం) ప్రయోగాన్ని 2013 నవంబరు 5న ఇస్రో విజయవంతంగా చేపట్టింది. ఆ తదుపరి సంవత్సరం సెప్టెంబరు 24న అది విజయవంతంగా అంగారకుడి కక్ష్యలోకి చేరింది. కేవలం ఆరు నెలలు పాటు మాత్రమే ఇస్రో దీన్ని రూపొందించగా అది ఇప్పటివరకు పనిచేసి ఆశ్చర్యపర్చింది. మరో నెల రోజులు గడిస్తే మంగళయాన్ ప్రయోగం పూర్తై దాదాపు తొమ్మిది ఏళ్లు గడుస్తుంది. అయితే, ఇప్పుడు మంగళయాన్ తన ప్రస్థానానికి ముగింపు పలుకుతోంది.

ఇన్నాళ్లు మంగళయాన్ లోని శాస్త్రీయ పరిశోధన పరికరాలను శాస్త్రవేత్తలు పర్యవేక్షించారు. కొంత కాలంగా మంగళయాన్ లోని నిభాగాల విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పుడు అందులో ఇంధనం అయిపోయింది. మళ్ళీ ఇంధనాన్ని నింపడంమనేది అంగారగ్రహ కక్ష్యలో క్లిష్టతరం. అంతేగాక శాటిలైట్ బ్యాటరీ సమర్థంగా పనిచేయడం లేదని ఇస్రో వర్గాలు పేర్కొన్నాయి. దీంతో, దాదాపు ఎనిమిది ఏళ్ల పాటు అంగారకుడి నుంచి సేవలు అందించిన మంగళయాన్ కథ ఇక ముగిసినట్లేనని తెలుస్తోంది.

దీనిపై తదుపరి వివరాలను ఇస్రో ఇప్పటివరకు వెల్లడించలేదు. కాగా, ఇప్పటివరకు మంగళయాన్ అందించిన డేటా అనేక విషయాలను తెలిపింది. మంగళయాన్ ను రూ.450 కోట్లతో చేపట్టారు. తొలి ప్రయత్నంలోనే మంగళయాన్ ప్రయోగం విజయవంతమైంది. మార్స్ నుంచి దాదాపు ఎనిమిది వేలకుపైగా ఫొటోలను పంపడమే కాకుండా ఆ గ్రహానికి సంబంధించిన అట్లాస్‌ను కూడా పంపింది. మంగళయాన్ కక్ష్యను ఇస్రో శాస్త్రవేత్తలు పలుమార్లు మార్చారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..