మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం ఓటర్లు 9.7 కోట్ల మంది. పురుషులు 4.93 కోట్లు, మహిళలు 4.5 కోట్ల మంది ఉన్నారు.
మహారాష్ట్రలో 288 నియోజక వర్గాల్లో 234 జనరల్ నియోజక వర్గాలు, 25 ఎస్టీ నియోజక వర్గాలు, 29 ఎస్సీ నియోజక వర్గాలు ఉన్నాయి. పోలింగ్ పై చలి ప్రభావం పడింది. ఇవాళ ఉదయం పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు అంతగా కనపడలేదు.
ఈ ఎన్నికల్లో సరిహద్దు నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు కీలకంగా మారనున్నారు. ఈ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడి, మహాయుతి కూటములు పోటీపోటీగా ప్రచారం నిర్వహించాయి. సత్తా చాటి తమదే అసలు పార్టీ అని నిరూపించుకునేందుకు షిండే సేన, ఉద్దవ్ సేన… అజిత్ ఎన్సీపీ, శరద్ పవార్ వర్గాలు తహతహలాడుతున్నాయి.
షిండే సేన, అజిత్ ఎన్సీపీ, బీజేపీలు కలిసి మహాయుతి కూటమిగా పోటీ చేస్తుండగా, ఉద్దవ్ సేన, శరద్ పవార్ ఎన్సీపీ, కాంగ్రెస్ కలిసి మహా వికాస్ అఘాడీగా పోటీ చేస్తున్నాయి. మహారాష్ట్రలో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పురుషుల్లో కేవలం 61 శాతం ఓటింగ్ నమోదైతే ఏకంగా 79 శాతం మంది మహిళలు ఓటేశారు. ఈ నెల 23న ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి. ఇక ఝార్ఖండ్‌లో రెండో దశ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇవాళ మొత్తం 38 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
ఏపీలో కూటమి ఫ్యూచర్‌కు ఢోకా లేదా? వచ్చే ఎన్నికల కోసం గ్రౌండ్ ప్రిపేర్ అవుతోందా?