ఎన్డీయేకి కొత్త అర్ధం చెప్పిన శశి థరూర్

బీజేపీ నేతృత్వంలోని కూటమి ఎన్డీయేకి కొత్త అర్థం చెప్పారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. పార్లమెంటులో ఎన్డీయే వ్యవహరిస్తున్న తీరును ఘాటుగా విమర్శించారు. లాక్‌ డౌన్ సమయంలో వలస కార్మికుల మరణాలు, రైతుల ఆత్మహత్యల గురించి కేంద్రం ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదని, అలాగే జిడీపీ గణాంకాలు, కోవిడ్-19 మరణాల విషయంలో తప్పుడు సమాచారం ఇస్తోందని ఆయన అన్నారు.


అందుకే, ఎన్‌డీఏ అంటే నో డేటా అవైలబుల్ అని ప్రధాని మోడీ ప్రభుత్వానికి వెటకారం చేస్తూ ట్విట్టర్ లో ఓ కార్టూన్ ను ఉంచారు శశి థరూర్. రైతుల ఆత్మహత్యలు, లాక్ డౌన్ సమయంలో కోవిడ్-19 వల్ల ప్రాణాలు కోల్పోయినవారు, కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారి సంఖ్య, దేశంలోకి అక్రమంగా వచ్చినవారి సంఖ్య, కోవిడ్-19 వల్ల మరణించినవారి సంఖ్య మొదలైన వివరాలు ఈ ప్రభుత్వానికి తెలియవన్నారు. దేశంలో ప్లాస్మా బ్యాంకుల సంఖ్య కూడా తెలియదన్నారు.