వైరల్ వీడియో : బోరుబావిలో పడిన బాలుడిని భలే రక్షించారు 

  • Publish Date - November 15, 2019 / 11:09 AM IST

మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కల్వాన్‌లో ఆరు సంవత్సరాల బాలుడు 300 అడుగుల లోతైన బోరుబావిలో పడిపోయాడు. వెంటనే స్పందించిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి ఆ బాలుడిని ప్రాణాలతో బయటకు తీశారు. వెంటనే హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డక్టర్లు చెప్పారు.

బోరుబావులకు ఎంతోమంది చిన్నారులు బలైపోతున్నారు. సాధారణంగా బోరుబావుల్లో పడిన చిన్నారులు ప్రాణాలతో బైటపడటం చాలా తక్కువ. కానీ కల్వాన్ లో జరిగిన ఈ ఘటనలో మాత్రం బాబు సురక్షితంగా బైటపడటం అందరికీ చాలా చాలా సంతోషాన్ని కలిగిందించి. బాబు ప్రాణాలతో బైటపడగానే స్థానికులు అంతా ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇది చూసినవారికే కాదు విన్నవారు కూడా ఆనందపడతారు అనటంలో ఎటువంటి సందేహం లేదు.