Patiala Medical College : పాటియాలా మెడికల్ కాలేజీలో 100 మందికి కోవిడ్

పంజాబ్ లోని కాలేజీలు కోవిడ్ హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి.  తాజాగా పాటియాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు పంజాబ్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా చెప్పారు.

Patiala Medical college

Patiala Medical College :  పంజాబ్ లోని కాలేజీలు కోవిడ్ హాట్ స్పాట్ లుగా మారుతున్నాయి.  తాజాగా పాటియాలా ప్రభుత్వ మెడికల్ కాలేజీలో 100 మందికి కోవిడ్ నిర్ధారణ అయినట్లు పంజాబ్ మంత్రి రాజ్ కుమార్ వెర్కా చెప్పారు. వీరిలో 60 మంది డాక్టర్లు, 30 మందికి పైగా  విద్యార్ధులు ఉన్నారు. హాస్టల్స్ లో ఉంటున్న విద్యార్ధులందరూ తమ గదులను ఖాళీ చేయాలని జిల్లా యంత్రాంగం అదేశించింది.

గతవారం పాటియాలా లోని థాపర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన దాదాపు 93 మంది విద్యార్ధులకు కోవిడ్ సోకగా…. తాజాగా మెడికల్ కాలేజీలో 100 మందికి కోవిడ్ సోకింది. విద్యార్ధులు ఎక్కువ సంఖ్యలో సమావేశం కావటం వల్లే థాపర్ యూనివర్సిటీలో కోవిడ్ కేసులు నమోదైనట్లు పాటియాలా డిప్యూటీ కమీషనర్ సందీప్ హన్స్ తెలిపారు.

Also Read : Somu Veerraju : సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్ కేసు నమోదు

సోమవారం పాటియాలాలో 143 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఐదురోజుల్లో నమోదైన 486 కేసులతో జిల్లాలోని యాక్టివ్ కేసుల సంఖ్య 491 కి చేరింది. ప్రజలంతా కోవిడ్ నిబంధనలు పాటించాలని , సందీప్ హన్స్ విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సామూహికంగా గూమికూడటం  కూడా కోవిడ్ కేసులు పెరగటానికి కారణమని ఆయన అన్నారు.