Neet
NEET : దేశ వ్యాప్తంగా ఆదివారం (సెప్టెంబర్ 12) నీట్ పరీక్ష జరగనుంది. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు 16 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షమంది ఈ పరీక్ష రాయనున్నారు. దేశ వ్యాప్తంగా 202 పట్టణాల్లో 3,842 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. తెలంగాణలోని 7 పట్టణాల్లో 112 కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఏపీలో 9 పట్టణాల్లో 151 కేంద్రాల్లో పరీక్షకు ఏర్పాట్లు చేశారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తోంది.
Read more : వాట్సాప్ యూజర్లు.. మీ చాట్ బ్యాకప్ ఇలా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు!
విద్యార్థులు మధ్యాహ్నం 1.30 తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రంలోకి అడ్మిట్ కార్డు, ఫోటో, ఏదైనా గుర్తింపు కార్డుతోపాటు ఓ చిన్న శానిటైజర్ బాటిల్ మాత్రమే అనుమతిస్తారు. పరీక్ష ఆఫ్ లైన్ విధానంలోనే జరుగుతోంది. విద్యార్థులు తప్పనిసరిగా కరోనా గైడ్ లైన్స్ పాటించాలని అధికారులు సూచించారు. మాస్క్ తప్పని సరి ధరించాలని తెలిపారు. షూ, ఫుల్ హ్యాండ్ షర్ట్స్ వేసుకోవడాన్ని తెలిపారు.
Read more : Delhi HC : ఆధార్ సంఖ్యను మార్చవచ్చా ? కుదరదన్న UIDAI