neet pg exam 2022
NEET PG 2022 : నీట్ పీజీ 2022 పరీక్షను వాయిదా వేశారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ పరీక్ష పీజీ 2022 ను 6 నుంచి 8 వారాలవరకు వాయిదావేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈపరీక్ష మార్చి12వ తేదీన జరగాల్సి ఉంది. అయితే నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్ కూడా అదే సమయంలో జరుగుతూ ఉండటంతో ఈ ఏడాది జరిగే నీట్ పరీక్షనువాయిదా వేయాలని విజ్ఞప్తులు కూడా వచ్చాయి.
మరో వైపు నీట్ పీజీ పరీక్షనువాయిదా వేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన పిటీషన్ ఈరోజువిచారణకు రానున్నది.తప్పని సరి ఇంటర్న్‌షిప్ వ్యవధి పూర్తికానందున మెడికల్ గ్రాడ్యుయేట్లు పరీక్షకుహాజరు కాలేరని.. అందువల్ల ఇంటర్న్‌షిప్ పూర్తి చేయటానికి గడువును మే 31 నుంచి పొడగించాలని కూడా వారు పేర్కోన్నారు. కొత్త పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తారు.