నెహ్రూ పెద్ద రేపిస్టు…సాధ్వి

దేశ తొలి ప్రధాని జవహార్‌లాల్ నెహ్రూనే పెద్ద రేపిస్టు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు విశ్వ హిందూ పరిషత్(VHP)నాయకురాలు సాధ్వీ ప్రాచీ. ప్రపంచానికి భారత్ అత్యాచారాల రాజధానిగా మారిందంటూ శనివారం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సాధ్వీ మండిపడ్డారు. మన దేశం రాముడు,కృష్టడు నడయాడిన పుణ్యభూమి. అసలు నెహ్రూనే పెద్ద రేపిస్టు. ఆయన మన సంస్కృతిని నాశనం చేశారు. టెర్రరిజమ్, నక్సలిజమ్, అవినీతి, అత్యాచారాలు..ఇవన్నీ నెహ్రూ కుటుంబం ఇచ్చిన బహుమతులని కొత్త వివాదానికి తెరతీశారు.
 
భారత్‌ ను అత్యాచారాల రాజధానిగా రాహుల్ గాంధీ అభివర్ణించడంపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. శనివారం కేరళలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ…ప్రపంచానికి భారత్ అత్యాచారాల రాజధానిగా మారిందని, మన దేశం మహిళలను ఎందుకు రక్షించలేకపోతోందంటూ ఇతర దేశాలు ప్రశ్నిస్తున్నాయని,ఓ బీజేపీ ఎమ్మెల్యే అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ…ప్రధాని మౌనంగా ఉన్నారంటూ రాహుల్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.