Punjab
Nephew of Punjab CM Channi : పంజాబ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చన్నీ మేనల్లుడు అరెస్టు కావడం కలకలం రేపింది. ఈడీ అధికారులు భూపేందర్ సింగ్ ను అరెస్టు చేశారు. ఇసుక అక్రమ రవాణా కేసులో ఆయనపై పలు ఆరోపణలున్నాయి. కొన్ని రోజులుగా భూపేందర్ సింగ్ ఇళ్లు, కార్యాలయాలపై ఈడీ దాడులు చేస్తోంది. 2018 ఇసుక తవ్వకాల కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చరణ్ జీత్ సింగ్ దాడులు చేసిన అనంతరం గురువారం అర్ధరాత్రి అతడిని అరెస్టు చేసింది. మనీ లాండరింగ్ ఆరోపణలకు సంబంధించి ఈడీ దర్యాప్తు చేస్తోంది. జనవరి 19వ తేదీన నిర్వహించిన దాడుల్లో రూ. 10 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ ఎన్నికలకు ముందు తనను ఇరికించడానికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నిందని చన్నీ ఆరోపిస్తున్నారు.
Read More : GATE 2022 : యధాతథంగా గేట్ 2022 పరీక్షలు
పంజాబ్ రాష్ట్రంలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అందులో పంజాబ్ లోక్ కాంగ్రెస్, బీజేపీ, శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్) పార్టీలతో కలిసి కూటమిగా బరిలోకి దిగుతోంది. ఈ కూటమిలో బీజేపీ 65 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఇక పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ మొత్తం 37 స్థానల్లో బరిలోకి దిగుతోంది. అలాగే శిరోమణి అకాలీదళ్ (యునైటెడ్) మొత్తంగా 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీపడుతోంది. ఈ మూడు పార్టీలు కలిసి కూటమిగా ఒప్పందం చేసుకుని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి.
Read More : Punjab Poll : చన్నీనా ? సిద్ధూనా ?.. పంజాబ్ కాంగ్రెస్ సీఎం క్యాండిడేట్ ప్రకటనకు టైం ఫిక్స్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్ధి పేరును 2022, ఫిబ్రవరి 06వ తేదీ వెల్లడిస్తామని పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీ క్లారిటీ ఇచ్చారు. సీఎం అభ్యర్ధిత్వం కోసం చన్నీ, పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక పార్టీ హైకమాండ్ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎవరిని ప్రతిపాదించినా తాను మద్దతిస్తానన్నారు చన్నీ. సీఎం అభ్యర్ధిత్వాన్ని ప్రకటించాలన్న పంజాబీల డిమాండ్‌ను నెరవేరుస్తున్నందుకు రాహుల్ గాంధీకి తాను ధన్యవాదాలు చెబుతున్నానని చన్నీ ట్వీట్ చేశారు.