Net Across Ganga In Bihar To Catch Covid 19 Corpses From Up
Net Across Ganga In Bihar To Catch COVID-19 Corpses : COVID-19 బాధితుల డజన్ల కొద్దీ మృతదేహాలు యూపీ నుంచి బీహార్ రాష్ట్రానికి కొట్టుకువస్తున్నాయి. ఇప్పటికే 71 కరోనా బాధిత మృతదేహాలను బీహార్ అధికారులు గుర్తించారు. నదిలో కరోనా మృతదేహాలు కొట్టుకురావడంతో బీహర్ ప్రజల్లో భయాందోళన నెలకొంది. ఇలా కొట్టుకువచ్చే మృతదేహాలను అడ్డుకునేందుకు గంగా నదికి అడ్డంగా వలను ఏర్పాటుచేశారు అధికారులు. సాంప్రదాయ హిందూ దహన సంస్కారాలకు అవసరమైన కలపను కొనలేక లేదా శ్మశానవాటికలు మునిగిపోవడంతో కరోనా బాధిత మృతుల తరపు బంధువులు ఇలా నదిలో నిమజ్జనం చేస్తున్నారని అంటున్నారు.
యూపీ రాష్ట్ర సరిహద్దులోని గంగా నదిలో భారీ వలను ఏర్పాటు చేశామని, పెట్రోలింగ్ పెంచామని బీహార్ జల వనరుల శాఖ మంత్రి సంజయ్ కుమార్ తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని గహ్మార్ జిల్లాలో 25 కరోనా మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. ఉత్తర రాష్ట్రంలోని శ్మశానాల్లో భారీ క్యూలు నిలిచిపోయాయి. అధికారిక కోవిడ్ -19 మరణాల సంఖ్య బుధవారం నాటికి ఒక పావు మిలియన్ శాతం పెరిగిందని అంచనా. చాలా మంది నిపుణులు వాస్తవ సంఖ్య చాలా రెట్లు ఎక్కువ ఉంటుందని భావిస్తున్నారు.
మరోవైపు బీహార్‌లోని గంగా నదిలో భారీసంఖ్యలో కరోనా బాధితుల మృతదేహాలు కొట్టుకురావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గంగా పరీవాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ నది నీటిని ఉపయోగిస్తే కరోనా వైరస్ సోకుతుందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ఆందోళన అవసరం లేదని… నీటి ద్వారా కరోనా వ్యాప్తి చెందదని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్లు భరోసా ఇచ్చారు.
కరోనా సోకిన వారి మృతదేహాలను నదిలో వదిలేస్తే నీటి ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంది అనడానికి గట్టి ఆధారాల్లేవని గుర్తుచేశారు. గంగా, దాని ఉప నదుల్లో శవాలను వదిలేయడం కొత్తేమీ కాదని… గతంతో పోలిస్తే ఇది గణనీయంగా తగ్గిందన్నారు. నదిలో శవాలను వదిలేస్తే నదీ కాలుష్యం పెరుగుతుందని తెలిపారు. నది నీటి ఉపయోగించుకునేవారు శుద్ధి చేసుకొని వాడుకోవాలని సూచించారు. నీటి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళన అవసరం లేదని నీతి ఆయోగ్ వీకే పాల్, ప్రభుత్వ సాంకేతిక సలహాదారు విజయ రాఘవన్ ఇప్పటికే స్పష్టం చేశారు.