Netflix Women series: “మార్పు తెచ్చిన మహిళలు” సిరీస్ కోసం నెట్‌ఫ్లిక్స్‌తో కేంద్ర సమాచారశాఖ ఒప్పందం

ఆయా రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను, వారి తాలూకు అనుభవాలను వెబ్ సిరీస్ రూపంలో పొందుపరుస్తూ..ప్రజలు కోసం తీసుకురావాలని భావించింది

Netflix

Netflix Women series: భారత దేశంలో పలు రంగాల్లో మహిళలు సాధించిన విజయాలు, మార్పు కోసం వారు చేస్తున్న కృషిని అభినందిస్తూ కేంద్ర సమాచార మరియు ప్రసార (I&B) మంత్రిత్వ శాఖ ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా రంగాల్లో మహిళలు సాధించిన విజయాలను, వారి తాలూకు అనుభవాలను వెబ్ సిరీస్ రూపంలో పొందుపరుస్తూ..ప్రజలు కోసం తీసుకురావాలని భావించింది. అందుకోసం ప్రముఖ ఓటీటీ ప్లాటుఫార్మ్ నెట్‌ఫ్లిక్స్‌తో కేంద్ర సమాచారశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈమేరకు మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ వెబ్ సిరీస్ ను ప్రారంభించారు. “మార్పు తెచ్చిన మహిళలు” వారి “అసాధ్య జీవితాలు”( “extraordinary lives” of “women change-makers”) పేరుతో ఈ వెబ్ సిరీస్ ను నెట్‌ఫ్లిక్స్‌ ప్రసారం చేయనుంది.

Also read:Helmet in Car: కారులో హెల్మెట్ సరిగా పెట్టుకోలేదంటూ చలాన్ విధించిన పోలీసులు: అవాక్కైన వాహనదారుడు

కాగా, మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్న భారత ప్రభుత్వం మొదటిసారి ప్రైవేటు మీడియా సంస్థతో(OTT) జతకట్టడం గమనార్హం. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సరికొత్త వెబ్ సిరీస్ ప్రారంభం పై I&B మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఉన్న సినీ దర్శకులకు “శిక్షణా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా సృజనాత్మక పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం” ఈ ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్ర్య వేడుకలను పురష్కరించుకుని నిర్వహిస్తున్న “ఆజాది కా అమృత్ మహోత్సవ్” కార్యక్రమంలో భాగంగా ‘ఆజాదీ కీ అమృత్ కహానియా’ అనే పేరుతో ఈ ప్రత్యేక వెబ్ సిరీస్ ను ప్రారంభించినట్లు అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. మంగళవారం నెట్‌ఫ్లిక్స్‌లో సిరీస్ ప్రారంభం సందర్భంగా మూడు చిన్న వీడియోలను ప్రదర్శించారు.

Also read:Rahul Gandhi: మోదీ గారికి ధన్యవాదాలు, ఉద్యోగాలపై 45 కోట్ల మంది ఆశలు కోల్పోయారు: మోదీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు

పద్మ అవార్డు పొందిన ప్రముఖ పర్యావరణవేత్త బసంతీ దేవి, కోసి నదిని రక్షించేందుకు ఆమె చేసిన కృషిని వీడియోగా ప్రదర్శించారు. 2017లో ఎవరెస్ట్ శిఖరాన్ని రెండుసార్లు అధిరోహించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత అన్షు జంజనంప మరియు భారతదేశపు మొదటి మహిళా అగ్నిమాపక సిబ్బంది హర్షిణి కన్హేకర్ సాధించిన విజయాలను సైతం ప్రదర్శించారు. ఈకార్యక్రమంలో నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టీవీ అధినేత బేలా బజారియాతో పాటు పైన పేర్కొన్న ముగ్గురు మహిళలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మంగళవారం ప్రదర్శించబడిన మూడు వీడియోలతో సహా మొదటి ఏడు వీడియోలు అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు మరియు దూరదర్శన్‌లో అందుబాటులో ఉంటాయి. గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, తమిళం, ఇంగ్లీష్ మరియు మలయాళంతో సహా పలు భాషల్లో అందుబాటులో ఉంటాయి. ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం నాటికి, నెట్‌ఫ్లిక్స్, I&B మంత్రిత్వ శాఖ కోసం దాదాపు 30 వీడియోలను ఈ వెబ్ సిరీస్ కోసం రూపొందించనుంది.

Also read:Tesla Cars in India: భారత్ లో అమ్మండి, కానీ చైనా నుంచి ఇక్కడికి తీసుకురాకండి: టెస్లా కంపెనీకి కేంద్ర మంత్రి గడ్కరీ సూచన