Rahul Gandhi: పార్లమెంటులో ఇదే ఫస్ట్ టైమ్..! ఆ ఇష్యూపై చర్చకు రాహుల్ గాంధీ ప్రతిపాదన.. ఓకే చెప్పిన అధికార పక్షం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా ఢిల్లీలో కాలుష్యం స్థాయి ఏ మాత్రం తగ్గడం లేదు.
Rahul Gandhi: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. ఇప్పుడీ అంశంపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చర్చ జరగాలని కోరారు. ఈ విషయంలో ఒకరిపై ఒకరు నెపం వేసుకోవడం మానేసి నిజాయితీగా చర్చించాలని కోరారు. రాజకీయ కోణం కాదని.. ప్రజల ఆరోగ్యం చూడాలన్నారాయన. లక్షలాది మంది చిన్నారులు ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్నారని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతిపక్షనేత ప్రతిపాదనకు కేంద్రం కూడా అంగీకరించింది. ఖచ్చితంగా ఈ అంశంపై చర్చిద్దామని ప్రకటించింది. ముందుగా బిజినెస్ అడ్వైజరీ కమిటీలో కాలుష్యం సమస్య గురించి ఎజెండా ప్రవేశపెట్టి తర్వాత ఎప్పుడు చర్చించేదీ డిసైడ్ చేద్దామన్నారు కేంద్రమంత్రి కిరణ్ రిజుజు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతగా ప్రయత్నించినా ఢిల్లీలో కాలుష్యం స్థాయి ఏ మాత్రం తగ్గడం లేదు. ఇది కొత్తగా వచ్చిన సమస్య కాదు..ప్రతి ఏటా ఇలా లీడర్లు హామీలు ఇస్తూనే ఉన్నా..పొల్యూషన్‌కి సొల్యూషన్ రావడం లేదు. మరోవైపు తాజాగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అత్యంత దారుణ స్థాయికి పడిపోతుంది. డిసెంబర్ 11 నుంచి పరిస్థితి ఇలా పూర్ కేటగరీ నుంచి వరస్ట్ కేటగరీకి పడిపోతుందని వాతావరణ శాఖ ముందుగానే ప్రకటించింది.
రాబోయే వారం వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని సెంట్రల్ గవర్నమెంట్ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ అలర్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌లో పార్టీలు ఈ సమస్యపై చర్చకు సిద్ధం కావడంతో సమస్య పరిష్కారానికి ఇంకేదైనా కొత్త మార్గం కనిపెడతారేమో అనే అంచనాలు ఢిల్లీ వాసుల్లో మొదలయ్యాయ్.
Also Read: ట్రంప్ గోల్డ్ కార్డ్‌తో రూ.9 కోట్లు పెడితే గ్రీన్ కార్డు వచ్చేస్తుందా?
