Bengaluru : రూ.6 కే ఉబెర్ రైడ్.. స్క్రీన్ షాట్ షేర్ చేసిన మహిళ

బెంగళూరు సిటీలో రద్దీగా ఉండే సమయంలో క్యాబ్ బుక్ చేసుకోవడం అంటే చుక్కలు కనపడతాయి. అలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ రూ.6 కే ఉబెర్ రైడ్ పొందగలిగానంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Bengaluru

Bengaluru : బెంగళూరు సిటీ భయంకరమైన ట్రాఫిక్‌కి కేరాఫ్ అడ్రస్. ఆఫీసులకి వెళ్లే సమయం.. వచ్చే సమయంలో ఇక్కడి వారికి సవాల్ అని చెప్పాలి. ఇక ఈ ట్రాఫిక్‌లో క్యాబ్ సర్వీసులు వసూలు చేసే అధికరేట్లు ఓ వైపు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ మహిళ రూ.6 కే ఉబెర్ రైడ్ పొందాను అంటూ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

Bengaluru : ఒకే సమయంలో వేర్వేరు యాప్‌లలో రైడ్స్ యాక్సెప్ట్ చేస్తున్న బెంగళూరు ఆటో డ్రైవర్లు.. అలా ఎలా?

మహిమ చందక్ అనే ట్విట్టర్ యూజర్ (@mahima_chandak) ఉబెర్ రైడ్ రూ.6 కే పొందానంటూ స్క్రీన్ షాట్ ఫోటోను ట్వీట్ చేసారు. ఈ ట్వీట్ చూసి నెటిజన్లు ముఖ్యంగా బెంగళూరులు వాసులు షాకయ్యారు. ప్రమోషనల్ కోడ్‌ని అప్లై చేసుకోవడం ద్వారా ఈ ఛార్జీ తగ్గినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ బెంగళూరువాసులకు ఇది చాలా అరుదైన సంఘటనగా చెప్పాలి. ఇక ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. నెటిజన్లు తమ అనుభవాలను పంచుకున్నారు.

Techie Tenant Interview : బెంగళూరు టెక్కీకి వింత అనుభవం.. అద్దె ఇంటికి ఇంటర్వ్యూ.. జాబ్ ఇంటర్వ్యూ కన్నా చాలా టఫ్..!

‘భలే తమాషా విషయం.. నేను కూడా నిన్న ఈ బగ్‌ని గమనించాను. ధర సున్నా. 35% తగ్గింపు. కానీ నా రైడ్‌ను ఏ డ్రైవర్ అంగీకరించలేదు’ అని ఒకరు.. ‘గతంలో ఉబెర్‌లో ఉచితంగా రైడ్ పొందాను. రూ.60 కి యాప్‌లో కూపన్ ఉండటంతో దానిని అప్లై చేసుకున్నాను’ అంటూ మరొకరు చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా ఇప్పుడు బెంగళూరులో ఉన్న పరిస్థితిని బట్టి  రూ.6 కి డ్రైవర్ రైడ్‌కి రావడం అంటే ఆశ్చర్యకరమే.