సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కొన్ని కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు.
సార్వత్రిక ఎన్నికల తొలిదశ పోలింగ్ కు రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో కొన్ని కీలక అంశాలపై కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. మంగళవారం(ఏప్రిల్-9,2019) ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలపై స్పందించారు.బీజేపీ ఎప్పుడూ కూడా రూ.15లక్షలు ప్రజల అకౌంట్లలో వేస్తామని చెప్పలేమని ఈ సందర్భంగా రాజ్ నాథ్ తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలపై రాజకీయ కక్షసాధింపులో భాగంగా ఐటీ,ఈడీ దాడులు జరుగుతున్నాయని విపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించిన రాజ్ నాథ్… ఈ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా తప్పన్నారు.ఏటీ,ఈడీ రైడ్స్ వెనుక ఎటువంటి పొలిటికల్ ఇన్ ఫ్లూయన్స్ లేదన్నారు.తమ దగ్గర ఉన్న ఇన్ పుట్స్ ఆధారంగా ఏజెన్సీలు తమ పని చేస్తున్నాయన్నారు. కొంతమంది ఆదేశాల మేరకే ఐటీ,ఈడీ దాడులు జరిగాయని మాట్లాడటం అన్యాయమన్నారు.
Read Also : నేను జగన్‌లా కాదు : వాళ్ల బిస్కెట్లకు ఆశపడను, టీఆర్ఎస్‌లో కలవను
బీజేపీ మేనిఫెస్టో ఒంటరి వ్యక్తి స్వరంలా ఉందన్న రాహుల్ విమర్శలపై స్పందిస్తూ…భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడు కూడా మేనిఫెస్టో తమారీలో ఇంతమంది ప్రజలు భాగస్వాములు కావడం జరగలేదని అన్నారు.రాహుల్ ఆరోపణలు బేస్ లెస్ అన్నారు.రాహుల్ ఎప్పుడూ ఇలాంటి అసత్యాలు మాట్లాడుతూ ఉంటారని..వాటిని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.బాలా కోట్ ఎయిర్ స్ట్రైక్స్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నలు అడుగవచ్చు కానీ సెక్యూరిటీ ఫోర్సెస్ ను ఫ్రూఫ్ కోరకూడదన్నారున.
జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, ఆర్టికల్ 35Aపై పీడీపీ,ఎన్సీ పార్టీలు మండిపడటంపై రాజ్‌నాథ్ స్పందించారు. ఇది కశ్మీర్ స్వాతంత్య్రానికి దారి తీస్తుందన్ననేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కశ్మీర్‌ను ఇండియా నుంచి వేరు చేయడం ఎవరి తరం కాదన్నారు. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే ఆ ఆర్టికల్స్ ను రద్దు చేసి తీరుతామని సృష్టం చేశారు.దేశంలో ఇద్దరు రాష్ట్రపతులు,ఇద్దరు ప్రధానులు ఉండే ప్రశ్నే లేదు అని రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. ఇక ఈ ఆర్టికల్స్‌ను రద్దు చేస్తే కశ్మీరే కాదు ఇండియా మొత్తం రగిలిపోతుంది అన్న మెహబూబా ముఫ్తీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఆమె అసహనానికి గురవుతున్నారు. ఆమె ఏమైనా మాట్లాడనీ.. మేము చేయదలచుకున్నది చేస్తాం అని తేల్చి చెప్పారు.
Read Also : లక్ష్మీపార్వతి జోస్యం : వైసీపీకి 125 ఎమ్మెల్యే , 22 ఎంపీ సీట్లు ఖాయం