ట్విట్టర్ లో కొత్త జీవిని కనుగొన్నారు ఆ ప్రోఫెసర్. ట్విట్టర్ లో కనుగొనడం ఏంటీ ? అని నోరెళ్లబెడుతున్నారా ? కానీ ఇదే జరిగింది. నేచురల్ హిస్టరీ మ్యూజియం ఆఫ్ డెన్మార్క్ లో జీవశాస్త్ర వేత్త విభాగంలో అసోసియేట్ ప్రోఫెసర్‌గా సోఫియా రెబొలైరా పనిచేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా కనుగొన్న ఈ జీవికి ట్రోగ్లమైసెస్ ట్విట్టరీ అని పేరు పెట్టారు. పారిస్‌కు చెందిన ఓ నేచురల్ హిస్టరీ మ్యూజియం.. రెబొలైరా కొత్త జీవిని కనుగొన్నట్లు ప్రకటించింది. ట్విటర్‌లో కనుగొన్నారు కనుక…దీనికి ట్రోగ్లమైసెస్ ట్విట్టరీ అని పేరు పెట్టారు.
ఈ ఫొటోను వర్జినీయా టెక్ లోని PHD విద్యార్థిని కీటక శాస్త్రవేత్త డెరెక్ హెన్నెస్ 2018లో పోస్టు చేయడం జరిగిందని, దీనిని స్టడీ చేయగా..చిన్న చిన్న రంధ్రాలతో ఉన్న ఫంగస్ తాను గమనించడం జరిగిందన్నారు. ఈ పరాన్న జీవిని అమెరికన్ మిల్లిపేడ్స్‌లో చూడలేదన్నారు. ట్రోగ్లోమైసెస్ ట్విట్టర్ లాబౌల్బెనియల్స్ అనే ఆర్డర్‌కు చెందినదిగా తెలిపారు.
అతి చిన్న లార్వాలా ఉండి.. పునరుత్పత్తి అవయవాలనైనా హోస్ట్ జీవుల వెలుపల నివసిస్తాయన్నారు. లాబౌల్బెనియల్స్ మొట్టమొదట 19వ శతాబ్దం మధ్యలో కనుగొనబడ్డాయని, 1890 నుంచి హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో రోలాండ్ థాక్స్టర్ చేసిన వివరణాత్మక అధ్యయనం పుస్తకంలో వాటి వర్గీకరణ స్థానం గుర్తించబడిందని వివరించారు. ఈ శిలీధ్రాలలో సుమారు 1260 జాతులు ఉంటాయని థాక్స్టర్ తెలిపారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో థాక్స్టర్ అధ్యయనం చేశారు.
Read Here>>నేవీ పైలట్ వెరైటీ శుభలేఖ : మ్యాటర్ వెరీ ఇంట్రెస్టింగ్