ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు కరోనా లాక్ డౌన్ టైమ్ లో జరిగిన పెళ్లికి హజరైన 100 మంది క్వారంటైన్ కు వెళ్లారు. పెళ్లి చేసుకున్నకొత్త జంటతో పాటు హాజరైన వారిలో మరో 100 మంది ఇప్పడు క్వారంటైన్ సెంటర్లో ఉన్నారు. నిజంగా కరోనా వైరస్ ఒక్కోక్కరికి ఒక్కోరకమైన అనుభవాన్ని మిగులుస్తోంది.
మధ్యప్రదేశ్ లో మే 26న జరిగిన తన మరదలి వివాహానికి సెంట్రల్ ఇండ్రస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేసే ఒక వ్యక్తి హాజరయ్యాడు. ఈ వివాహానికి పలువురు బంధువులు, కుటుంబ సభ్యులు భారీ సంఖ్యలోనే హజరయ్యారు. చింద్వారాలోని జున్నార్డియో ప్రాంత నివాసి అయిన ఆవ్యక్తి పెళ్లి కోసం వచ్చి పలువురు బంధులను కలిశాడు. పెళ్లి వేడుకలోనూ బంధు మిత్రులతో సరదాగా గడిపాడు.
మే 26 న ముహూర్తం కాగా అంతకు ముందు రోజు జలుబు దగ్గు, తీవ్రం కావటంతో జిల్లాలోని ప్రభుత్వం ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నాడు. తర్వాత రోజు జరిగిన పెళ్లి వేడుకల్లోనూ ఆ వ్యక్తి సంతోషంగా పాల్గోన్నాడు. పెళ్లి రోజు వచ్చిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
అప్రమత్తమైన ప్రభుత్వ అధికారులు వెంటనే పెళ్లి మండపానికి వచ్చి కరోనా బాధితుడితో సహా అతడి కుటుంబ సభ్యులు, నూతన వధూవరులను క్వారంటైన్ కు తరలించారు. ఇంకా ఎవరెవరు పెళ్ళికి హాజరయ్యారు అనే అంశాన్ని ఆరాతీస్తున్నారు.
బాధితుడు మధ్య ప్రదేశ్ వచ్చిన తర్వాత ఎవరెవర్ని కలిశాడు. ఎవరెవరితో సంప్రదింపులు జరిపాడు అనే సమాచారాన్ని కూడా సేకరిస్తున్నామని చింద్వారా కలెక్టర్ సౌరభ్ సుమన్ తెలిపారు. కరోనావైరస్ వ్యాప్తికి కారణమైన వ్యక్తిపై తదుపరి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెప్పారు.
Read: క్వారంటైన్ సెంటర్ లో పెళ్లి చేసుకున్న ప్రేమజంట…ఇది కరోనా కాలం ట్రెండ్