COVID-19 In India : డెల్టా టెన్షన్.. వచ్చే 125 రోజులు కీలకం!

డెల్టా వేరియంట్ మళ్లీ టెన్షన్‌ పెడుతోంది.. అటు ప్రభుత్వాలు.. ఇటు ప్రజల నిర్లక్ష్యం కారణంగా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోబోతున్నామని అంటున్నారు నిపుణులు.. ఇప్పటికే థర్డ్ వేవ్‌ ఎంట్రీ ఇచ్చేసిందని WHO మొత్తుకుంటోంది..

Next 100 To 125 Days Are Critical In Fight Against Covid In India

COVID-19 In India : డెల్టా వేరియంట్ మళ్లీ టెన్షన్‌ పెడుతోంది.. అటు ప్రభుత్వాలు.. ఇటు ప్రజల నిర్లక్ష్యం కారణంగా త్వరలోనే భారీ మూల్యం చెల్లించుకోబోతున్నామని అంటున్నారు నిపుణులు.. ఇప్పటికే థర్డ్ వేవ్‌ ఎంట్రీ ఇచ్చేసిందని WHO మొత్తుకుంటోంది.. ఇండియాతో సహా ప్రపంచ దేశాల్లో ఉన్న పరిస్థితిని చూస్తే ఇది ముమ్మాటికి నిజమే అనిపిస్తోంది. దేశంలో మళ్లీ క్రమంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి.. గత కొన్ని వారాలుగా చూస్తుంటే కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు తెలుస్తోంది.. డెల్టా, డెల్టా ప్లస్‌, కప్పా వేరియంట్ల కేసులు ఇండియాలో రోజురోజుకు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.. కేరళ, మహారాష్ట్రలోనే సగం కేసులు నమోదవుతున్నాయి.. మరోవైపు పలు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడటం ఇప్పుడీ ఆందోళనలను మరింత పెంచుతోంది.

కరోనా కేసుల సంఖ్య పెరగడంపై ఈశాన్య రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. శుక్రవారం మరో ఆరు రాష్ట్రాల సీఎంలతో సమావేశమయ్యారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఆంధప్రదేశ్‌, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అధిక కేసులు నమోదవుతున్న ప్రాంతాలను గుర్తించి చర్యలు చేపట్టాలని మోదీ సూచించారు. కఠిన నిబంధనలు అమలు చేసి మూడో దశ రాకుండా అడ్డుకోవాలన్నారు. టెస్ట్‌-ట్రాక్‌-ట్రీట్‌-టీకా విధానాన్ని మరింత విస్తరించాలని తెలిపారు. భారత్‌కు కరోనా ముప్పు తొలగలేదని అయితే.. వచ్చే మరో 100-125 రోజులు చాలా క్రిటికల్ అని కేంద్రం ప్రకటించింది.

పిల్లలు జాగ్రత్త..
పిల్లలు కరోనాబారిన పడే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని హెచ్చరిస్తున్నారు. కొవిడ్‌-19 నిబంధనలను పకడ్బందీగా పాటిస్తూ చిన్నారులను మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. టీకాలతో 95శాతం మరణాల రేటు తగ్గిందని వీకే పాల్ తెలిపారు. రెండో వేవ్‌లో కరోనా మరణాలను తగ్గించడంలో టీకాలు అత్యంత కీలక పాత్ర పోషించాయని అన్నారు. రెండు డోసులు వేసుకొన్నవారిలో మరణాల రేటు 95 శాతం తగ్గిందన్నారు. ఒక్క డోసు వేసుకొన్నవారిలో 82 శాతం ఉందన్నారు. గడిచిన వారం రోజుల్లో దేశవ్యాప్తంగా 73 జిల్లాల్లో మాత్రమే రోజుకు 100 కంటే ఎక్కువ కరోనా కేసులు నమోదు అవుతున్నాయని చెప్పారు. 47 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కంటే ఎక్కువగా ఉందని చెప్పారు.