Terrorist Conspiracy : ఉగ్రవాదుల భారీ కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ.. దక్షిణాది రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో సోదాలు

భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను ఉగ్రవాదులు చేర్చుకుంటున్నారు.

NIA Foiled Terrorist Conspiracy : ఉగ్రవాదుల భారీ కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ భగ్నం చేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోని 31 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, అరబిక్ భాషలో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరులో 22 ప్రాంతాలు, హైదరాబాద్ లోని 5 ప్రాంతాలు ఎన్ఐఏ సోదాలు చేసింది.

ఇందులో 61లక్షల నగదు, విదేశీ డబ్బును సీజ్ చేశారు. అరబిక్ క్లాసుల పేరుతో యువతను ఉగ్రవాదం వైపు ఐసిస్ ఆకర్షిస్తోంది. సోషల్ మీడియా వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా ప్రత్యేక శిక్షణా తరగతులు ఇస్తూ వారిని రిక్రూట్ చేసుకుంటున్నారు.

Pakistan Bomb Blast: మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. పాకిస్తాన్‭లో భారీ బాంబ్ బ్లాస్ట్‭.. 40 మంది మృతి, 150 మందికి గాయాలు

భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కిలాఫత్ ఐడియాలజీని వాప్తి చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఒక గ్రూపుగా ఏర్పడి స్థానిక యువతను ఉగ్రవాదులు చేర్చుకుంటున్నారు. గతేడాది అక్టోబర్ 23న ఉగ్రవాదులు కోయంబత్తూర్ లో కారు పేల్చివేత చర్యకు పాల్పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు