Mumbai Night curfew : ముంబైలో నైట్ కర్ఫ్యూ : కరోనా కట్టడికి ఉద్ధవ్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో 35 వేల 726 కరోనా కేసులు నమోదయ్యాయి.

Uddhav govt’s key decision to control corona : మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. ఒక్క రోజు వ్యవధిలో 35 వేల 726 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 166 మంది చనిపోయారు. గత కొన్ని రోజులుగా కొత్త కేసులు, మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మొత్తం కరోనా కేసుల సంఖ్య 27 లక్షలకు చేరువవుతుండగా.. యాక్టివ్ ‌కేసుల సంఖ్య 3 లక్షలు దాటింది. మర-ణాల సంఖ్య 54 వేల 73కు చేరింది.

గత 24 గంటల్లో 14 వేల 523 మంది కరోనా రోగులు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ ‌అయ్యారు. ముంబైలో 24 గంటల వ్యవధిలోనే రికార్డుస్థాయిలో 6 వేల 123 కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. నాసిక్‌ జిల్లాలో ఒక్క రోజులో 4 వేల 918మంది కరోనా బారినపడ్డారు. మురికివాడలతో పోలిస్తే అపార్ట్‌మెంట్లలోనే అధిక పాజిటివ్‌ రేటు కనిపిస్తోంది.

మరోవైపు కరోనా కట్టడికి భాగంగా.. ముంబైలో ఇవాళ రాత్రి పదిగంటల నుంచి నైట్‌ కర్ఫ్యూ అమలవనుంది. కర్ఫ్యూ వేళల్లో కేవలం నిత్యావసరాలను మాత్రమే అనుమతి ఉంది. హోటళ్లు, పబ్‌లు మూతపడతాయి. షాపింగ్‌ మాల్స్‌ను రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకూ మూసిఉంచేలా స్ధానిక అధికారులు చర్యలు తీసుకోనున్నారు. ప్రజలు కరోనా నిబంధనలను పాటించాలని, లేని పక్షంలో కఠిన శిక్షలు తప్పవని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు.

ట్రెండింగ్ వార్తలు