Viral Video: కలెక్టర్‌తో కన్నీరు పెట్టించిన వృద్ధుల నృత్యం.. ఎందుకంటే?

ఆ వృద్ధుల బాధను చూసి అక్కడున్న వారంతా తట్టుకోలేకపోయారు. ఆ సమయంలో..

Nilgiris District Collector

Nilgiris District Collector: ప్రాణానికి ప్రాణంగా కొడుకులు, కూతుళ్లను పెంచుతుంది అమ్మ. అంతలా ప్రేమను కురిపిస్తూ పెంచిన తల్లిని నిర్లక్ష్యం చేస్తూ చాలా మంది కొడుకులు, కూతుళ్లు వృద్ధాశ్రమంలో వదిలేస్తారు. చివరి రోజుల్లో తమ పిల్లలు, మనవళ్లు, మనవరాళ్లతో ఉండలేకపోతున్నామంటూ వృద్ధులు కుమిలిపోతుంటారు.

అటువంటి వృద్ధులే తాజాగా తల్లి గొప్పదనంపై ఉండే సినిమా పాటకు నృత్యం చేశారు. దీంతో కలెక్టర్ తో పాటు అక్కడున్న వారంతా కన్నీరు ఆపుకోలేకపోయారు. తమిళనాడులోని నీలగిరి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

అందరితోనూ కన్నీరు పెట్టిస్తోంది. మేలుకూడలూరులోని వృద్ధాశ్రమంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నీలగిరి జిల్లా కలెక్టర్ అరుణ పాల్గొన్నారు. వృద్ధులు నృత్యం చేస్తుంటే వారి బాధలను పాట రూపంలో వర్ణిస్తున్నట్లే అనిపించింది. ఆ వృద్ధుల బాధను చూసి అక్కడున్న వారంతా తట్టుకోలేకపోయారు. ఆ సమయంలో ఒకరు ఈ వీడియోను స్టార్ట్ ఫోనులో తీశారు.

முதியோர் இல்லத்தில் கண்ணீர் மல்கிய நீலகிரி கலெக்டர்!#MuthiyorIllam #OldPeopleHouse #Oldpeople #Nilgiri #NilgiriCollector pic.twitter.com/wq74KFnk1b

— AvalVikatan (@AvalVikatan) October 11, 2023