Union Budget 2025: గిగ్ వర్కర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం.. ఇకనుంచి వారికి మంచిరోజులు..

2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర పద్దును ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలకు శుభవార్తలు చెప్పారు.

Nirmala Sitharaman

Union Budget 2025: 2025-26 ఆర్థిక సంవత్సరానికిగానూ కేంద్ర పద్దును ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11గంటలకు సభ ప్రారంభం కాగానే ఆమె బడ్జెట్ ను ప్రవేశపెట్టి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలు వర్గాల ప్రజలకు శుభవార్తలు చెప్పారు. ఇందులో భాగంగా గిగ్ వర్కర్లకు అదిరిపోయే శుభవార్త చెప్పారు.

Also Raed: Budget 2025 : మధ్యతరగతి ఉద్యోగులకు భారీ ఊరట.. రూ.12 లక్షల వరకు నో ఇన్‌కం ట్యాక్స్!

జొమాటో, స్విగ్గీ, జెప్టో, అమెజాన్, ఫ్లిప్ కార్డ్ వంటి ఆన్ లైన్ సంస్థలు ప్రజలకు విశేష సేవలందిస్తున్నాయి. తమకు కావాల్సిన ఫుడ్స్ కు సంబంధిన పదార్థాలు, ఇంటి సరుకులు, ఇతర వస్తువులను ఆన్ లైన్ లో ఆర్డర్ చేస్తే ఇంటికే డెలివరీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఆన్ లైన్ ఫుడ్, గ్రాసరీ వంటి ఆన్ లైన్ డెలివరీ యాప్స్ లో వర్క్ చేసే ఈ అసంఘటిత రంగాల ఉద్యోగులకు (గిగ్ వర్కర్లకు) కేంద్రం బడ్జెట్ లో గుడ్ న్యూస్ చెప్పింది. వారికి గుర్తింపు కార్డుతో పాటు ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో సుమారు కోటి మంది గిగ్ వర్కర్లకు లాభం చేకూరనుంది.

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో.. ఈ-శ్రమ్ పోర్టల్ కింద గిగ్ వర్కర్లకు గుర్తింపు కార్డులు, ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద వారికి ఆరోగ్య బీమా సదుపాయాన్ని కల్పించనున్నట్లు వివరించారు.