Opposition Parties Unity : విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు.. కేజ్రీవాల్ ని కలిసిన నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్

కేంద్రం ఆర్డినెన్స్‌ను బిల్లుగా తీసుకొచ్చే పక్షంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే రాజ్యసభలో ఆ బిల్లును ఓడించవచ్చన్నారు.

Nitish Kumar – Kejriwal : దేశంలో విపక్షాల ఐక్యత కోసం బీహార్ సీఎం నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ని నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ కలిశారు. విపక్షాల ఐక్యత, ఢిల్లీలో పాలన అధికారులపై కేంద్రం ఆర్డినెన్స్, సుప్రీంకోర్టు తీర్పుపై నేతల మధ్య చర్చ జరుగుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు విపక్షాల ఐక్యత కోసం దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీల నేతలను నితీశ్ కుమార్, తేజస్వి యాదవ్ కలుస్తున్నారు.

ఢిల్లీకి అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తూ కేంద్రం ఆర్డినెన్స్ తీసుకురావడంపై, ఢిల్లీ ప్రజలకు మద్దతుగా నితీశ్ కుమార్ ఉంటారని తెలిపారు. కేంద్రం ఆర్డినెన్స్‌ను బిల్లుగా తీసుకొచ్చే పక్షంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే రాజ్యసభలో ఆ బిల్లును ఓడించవచ్చన్నారు.

Indian Air Force: ఆ యుద్ధ విమానాలను వాడొద్దు.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక నిర్ణయం..

అలాంటిదేమైనా జరిగితే 2024లో బీజేపీ ప్రభుత్వం పోతుందనే సందేశాన్ని పంపవచ్చని చెప్పారు. ఎన్నికైన ప్రభుత్వానికి ఇచ్చిన అధికారాలు ఎలా తీసేస్తారని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ప్రశ్నించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. తాము అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ఉంటామని చెప్పారు. దేశంలోని అన్ని ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు