అంతా తూచ్: 2వేల నోటు రద్దు అవడం లేదు

  • Published By: venkaiahnaidu ,Published On : January 4, 2019 / 08:06 AM IST
అంతా తూచ్: 2వేల నోటు రద్దు అవడం లేదు

2వేల రూపాయల నోట్ల ప్రింటింగ్ ను ఆర్బీఐ క్రమక్రమంగా తగ్గిస్తుందని, భవిష్యత్తులో 2వేల రూపాయల నోట్లు రద్దు కాబోతున్నాయంటూ నాలుగైదు రోజులుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే అసలు ఇటీవల 2వేల రూపాయల నోట్లకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటీ నిర్ణయం తీసుకోలేదని ఎకనామిక్ అఫైర్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ సుభాష్ చంద్ర గార్గ్ సృష్టం చేశారు. అయితే తగినంత నోట్ల కన్నా చలామణిలో 2వేల రూపాయల నోట్లు ఎక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. చలామణిలో ఉన్న కరెన్సీలో 35శాతం 2వేల రూపాయల నోట్లు ఉన్నాయని ఆయన తెలిపారు.
2016నవంబర్ లో  నోట్ల రద్దు తర్వాత 2వేల రూపాయల నోటు చలామణిలోకి వచ్చిన విషయం తెలిసిందే.