Health Minister Mandaviya : కోవిడ్ రెండో దశలో.. ఆక్సిజన్ కొరతతో ఎవ్వరూ చనిపోలేదు

దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత కారణంగా ఎవ్వరూ చనిపోలేదని రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలు రిపోర్ట్ చేసినట్లు మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కి తెలిపింది.

Health Minister Mandaviya దేశంలో కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత వల్ల రోగులు మరణించినట్లు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి నిర్దిష్టమైన సమాచారం లేదని మంగళవారం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ కి తెలిపింది. హెల్త్ అనేది రాష్ట్ర విషయం. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ కేసులు,మరణాలు రోజువారి పద్ధతిలో రిపోర్ట్ చేస్తాయి. ఆక్సిజన్ కొరత కారణంగా ప్రత్యేకంగా మరణాలు నమోదైనట్లు ఏ ఒక్క రాష్ట్రం రిపోర్ట్ చేయలేదు అని రాజ్యసభలో ఓ ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ఆరోగ్యశాఖ బదులిచ్చింది.

ఈ ఏడాది ఏప్రిల్-మే మధ్యలో కోవిడ్ వైరస్ ఉధృతిని దృష్టిలో పెట్టుకుని కరోనా పేషెంట్లకు క్లినికల్ కేర్ కల్పించేందుకు మెడికల్ ఆక్సిజన్ సరఫరా మరియు ఇతర వినియోగ వస్తువుల సరఫరా సహా అనేక రకాల చర్యలతో కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు మద్దుతుగా నిలబడిందని ఆరోగ్యశాఖ తెలిపింది.

రాష్ట్రాలు పంపిన డేటాని పబ్లిష్ చేయడమే కేంద్రప్రభుత్వ బాధ్యత అని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుక్ మాండవీయ ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన డేటాకి కేంద్రం కట్టుబడి ఉంటుంది మరియు పబ్లిష్ చేస్తుంది. కేంద్రం పని డేటాని పబ్లిష్ చేయడం తప్ప ఇంకేమీ లేదు. తక్కువ మరణాలు,తక్కువ పాజిటివ్ కేసులు చూపించాలని కేంద్రం ఏ ఒక్క రాష్ట్రానికి చెప్పలేదు. దానికి ఎలాంటి కారణం లేదు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఇదే విషయాన్ని సీఎంలతో మీటింగ్ సమయంలో చెప్పారని ఆరోగ్యమంత్రి సమాధానమిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు