Randeep Guleria
Randeep Guleria : కరోనా థర్డ్‌వేవ్ వస్తుందన్న ఆధారాలు ఏమీ లేవని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో కరోనా మూడో ప్రభజనం… అది బాలలపై తీవ్ర ప్రభావం చూపుతుందని జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొట్టిపారేసింది. దేశంలో అర్హులైన వారందరికీ వ్యాక్సిన్ వేసేంతవరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్త వహించాలని సూచించింది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా మాట్లాడుతూ… భారతదేశంలో కానీ, ప్రపంచ వ్యాప్తంగా కానీ కోవిడ్-19 బాలలపై ఎక్కువ ప్రభావం చూపుతుందనే సమాచారం ఏదీలేదని చెప్పారు.
కరోనా సెకండ్ వేవ్ లో ఇన్‌ఫెక్షన్లు సోకిన వారిలో చాలా స్వల్ప అస్వస్ధతలు, లేదా ఎక్కువ వ్యాధులు కనిపించినట్లు తెలిపారు. భవిష్యత్తులో కోవిడ్ చిన్నపిల్లలపై ఎక్కువ ప్రభావం చూపుతుందని కొందరు చేస్తున్న వాదనను ఆయన తోసిపుచ్చారు. కాగా…థర్డ్‌వేవ్ రాకుండా మేము చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గులేరియా వ్యాఖ్యానించారు.