Farmer Protests: రైతుల నిరసనల్లో ఒక్కరూ మరణించలేదా? కేంద్రం ఏం చెబుతోంది?

కేంద్రం తీసుకుని వచ్చిన మూడు రైతు చట్టాలతో రోడ్డెక్కిన రైతులు చివరకు విజయం సాధించారు.

Farmer Protests: కేంద్రం తీసుకుని వచ్చిన మూడు రైతు చట్టాలతో రోడ్డెక్కిన రైతులు చివరకు విజయం సాధించారు. కేంద్రం తీసుకుని వచ్చిన చట్టాలను నల్లచట్టాలు అంటూ అంతకుముందు వేలల్లో రైతులు రోడ్డెక్కగా.. పలు ఘటనల్లో నిరసన చేస్తూ పలువురు మృతిచెందారు.

అయితే, ఇప్పుడు చట్టాలను రద్దు చేయగా.. రైతుల మరణాల గురించి ప్రభుత్వం వద్ద “రికార్డులు లేవు” అని వ్యవసాయశాఖా మంత్రి నరేంద్ర తోమర్ ఈరోజు పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు.

బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లయితే ఎంతమందికి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది అనే డేటా గురించి ప్రతిపక్షాలు ప్రశ్నించగా తోమర్ లోక్‌సభలో ఈమేరకు సమాధానం చెప్పారు.

ఘాట్‌ రోడ్డులో విరిగిపడిన కొండ చరియలు

వ్యవసాయ మంత్రిత్వ శాఖ దగ్గర ఈ విషయానికి సంబంధించి ఎటువంటి రికార్డు లేదు అని చెప్పారు. 700 మందికి పైగా రైతులు నిరసనల సమయంలో మరణించారని, ప్రతిపక్షాలు మరియు రైతు నాయకులు చెబుతున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్రం ఇప్పుడు “దేశానికి క్షమాపణ” చెబుతున్నారని, రద్దు ప్రకటన చేశారంటూ విమర్శిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు