కరోనాతో ఆగమాగం : Rambo Circus కు చెడ్డ రోజులు

  • Publish Date - April 7, 2020 / 11:50 AM IST

అంతా ఆగమాగం. ఎక్కడ చూసినా గందరగోళ పరిస్థితులు. కరోనా రాకాసి మూలంగా ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచ దేశాలను చుట్టేసింది. వేల సంఖ్యలో చనిపోయారు. వైరస్ కు విరుగుడు లేకపోవడంతో మృతుల సంఖ్య అధికంగా ఉంది. భారతదేశంలోకి ప్రవేశించిన వైరస్ వంద మందికిపైగానే బలి తీసుకుంది.

ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుండడంతో లాక్‌డౌన్ విధించాల్సిన పరిస్థితి. ఒక్కసారిగా జనజీవనం స్తంభించిపోయింది. పనులు లేక వలస కూలీలు తమ సొంతూళ్లకు వెళ్లిపోయారు. చిన్న చిన్న సంస్థలు, ఇతర వాణిజ్య కేంద్రాల పరిస్థితి దయనీయం. అందులో రాంబో సర్కస్ ఒకటి. 

దేశంలోనే అతిపెద్ద సర్కస్ లలో రాంబో ఒకటి. వివిధ రాష్ట్రాల్లో ప్రదర్శనలిస్తూ మంచి పేరు గడిచింది. కరోనా పుణ్యమా అని గడ్డురోజులు దాపురించాయి. లాక్ డౌన్ తో సర్కస్ నిలిచిపోయింది. దీనినే నమ్ముకున్న వారి పరిస్థితి ఆగమ్యగోచరం. మార్చి 06వ తేదీన నవీ ముంబైలోని ఏరోలి ప్రదర్శనలు ఇవ్వడానికి సర్కస్ బృందం వచ్చింది. కానీ కరోనా వల్ల సర్కస్ ను మూసివేయాలని అధికారులు చెప్పడంతో షోస్ నిలిపివేశారు. 

 

సర్కస్‌లో 90 మంది పని చేస్తున్నారు. 32 మంది మహిళా ఆర్టిస్టులు, 58 మంది మగవారితో పాటు 21 జంతువులున్నాయి. ప్రస్తుతం ప్రదర్శనలు నిర్వహించకపోవడంతో తాము ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఏరోలి మున్సిపల్ అధికారులు సహాయం అందిస్తున్నారని తెలిపారు. 

ట్రెండింగ్ వార్తలు