పెట్రోల్,డీజిల్ వాహనాలను బ్యాన్ చేయాల్సిన అవసరం లేదు

ఎలక్ట్రిక్ మొబిలిటీ తనంతట తానుగా ఊపందుకుంటుందని,అంతేకాకుండా రెండేళ్లలో  దేశంలో అన్ని ఎలక్ట్రిక్ బస్సులు ఉంటాయి కనుక పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. 

ఇవాళ(సెప్టెంబర్-23,2019)సూక్ష్మ,చిన్న,మధ్యతరగతి వ్యాపారాల్లోఇంధన సామర్థ్యంపై జరిగిన జాతీయ సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ…నేనెప్పుడూ ఎలక్ట్రిక్ వాహనాల గురించి మాట్లాడతాను. ఇప్పుడు అది సాధారణంగా మొదలైంది. తప్పనిసరి చేయాల్సిన అవసరం ఏమీ లేదు.పెట్రోల్,డీజిల్ వాహనాలపై బ్యాన్ విధించాల్సిన పని లేదు. రాబోయే రెండేళ్లలో అన్ని బస్సులు ఎలక్ట్రిక్ గా ఉంటాయి.బయో ఇథనాల్,సీఎన్ జీతో నడుస్తాయి. 

విద్యుత్తుపై వాహనాలను నడుపుతుంటే అది లీటరు డీజిల్‌కు రూ .15 ఖర్చు అవుతుంది. దేశంలో పొగ-ఉద్గార యంత్రాలను నిషేధిస్తానని ఒక సమావేశంలో పరిశ్రమకు చెప్పినప్పుడు అందరూ భయపడ్డారు. ఇప్పుడు, మనకు జర్మనీ నుండి ప్లాస్టిక్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి, ఇవి ఎల్‌ఎన్‌జి (ద్రవీకృత సహజ వాయువు) పై 50 శాతం, సిఎన్‌జిపై 40 శాతం ఖర్చు ఆదా చేయగలవన్నారు.