No non teaching duties for teachers says Maharashtra CM Shinde
Eknath Shinde: ప్రభుత్వ టీచర్లు టీచింగ్ కాకుండా కొన్ని ప్రభుత్వ పనులు చేస్తుంటారు. పోలీయో, ఎన్నికలు.. ఇతర పనుల్లో తరుచూ వారు కనిపిస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి పనుల నుంచి టీచర్లకు విముక్తి కల్పిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే మంగళవారం ప్రకటించారు. బోధనేతర విధులను టీచర్లకు కేటాయించబోమని, వారిని విద్యార్థులకు చదువు చెప్పడానికి మాత్రమే వినియోగించుకుంటామని వెల్లడించారు. అయితే జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో ఇందుకు మినహాయింపు ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
టీచర్స్ డే సందర్భంగా సెప్టెంబర్ 5 (సోమవారం) ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొంత మంది టీచర్లతో సీఎం షిండే మాట్లాడారు. ఈ సందర్భంగా టీచర్లను నాన్ టీచింగ్ పనుల నుంచి విముక్తి చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ‘‘టీచర్లకు నాన్-టీచింగ్ (బోధనేతర) పనులు అప్పగిస్తున్నట్లు నాకు అనేకమైన ఫిర్యాదులు, అప్లికేషన్లు వస్తున్నాయి. అయితే ఒక్క జాతీయ ప్రాముఖ్యత కలిగిన అంశాల్లో తప్ప టీచర్లకు ఇక నుంచి బోధనేతర పనులు అప్పగించకూడదని నిర్ణయం తీసుకున్నాం. సంబంధిత విభాగానికి ఈ విషయమై ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం’’ అని అన్నారు.
Bengaluru Flooding: బెంగళూరు వరదలకు కాంగ్రెసే కారణమట.. కర్ణాటక సీఎం బొమ్మై విమర్శలు