పెట్రోలు, డీజిల్ వాహనాలపై నిషేధం విధించాలని ప్రభుత్వం ఆలోచించడం లేదని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ క్లారిటీ ఇచ్చారు. ఆటో మోబైల్ పరిశ్రమ పరిస్థితి అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదొర్కొంటున్న సమయంలో గడ్కరీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
సేల్స్ రేట్ దారుణంగా పడిపోవడంతో చాలా కార్ల సంస్థలు ప్లాంట్లను మూసివేసే పరిస్థితి తలెత్తింది. ఆర్థిక మాంద్యం కొనసాగుతున్న సమయంలో మారుతీ వాహనాల అమ్మకాలు పడిపోయాయి. దీంతో గురుగ్రామ్, మానేసర్ ప్లాంట్లలో ఈనెల 7వ, 9వ తేదీన రెండు రోజుల పాటు ఉత్పత్తిని నిలిపివేయనున్నట్లు ప్రముఖ వాహన తయారీదారు మారుతీ సుజికీ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
త్వరలోనే వెహికల్ స్క్రాపేజ్ పాలసీని తీసుకురావాలనే యోచనలో ప్రభుత్వం ఉందని గడ్కరీ తెలిపారు. హైబ్రీడ్ వాహనాలపై జీఎస్టీని తగ్గించాలని కూడా ప్రభుత్వం ఆలోచిస్తోందని గడ్కరీ చెప్పారు. ఆటో మోబైల్ పరిశ్రమ పరిస్థితి అత్యంత క్లిష్ట సమయాన్ని ఎదొర్కొంటున్న సమయంలో ఆటోమొబైల్ ఇండస్ట్రీని బతికించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.