Employees at Cloud Science Labs (@cloudsciencelabs/Instagram)
Video: మీ ఆఫీసులో బాస్‌గా మహిళ ఉందా? పురుషుడా ఉన్నాడా? మహిళా బాస్ ఉంటే చాలా డేంజర్ అని, ఉద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తుందని చాలా మంది అనుకుంటున్నట్టున్నారు. మహిళల వద్దకు వెళ్లి అడిగినా సరే.. తమకు పురుషుడే బాస్‌గా కావాలని, లేడీ వద్దని అంటున్నారు. తాజాగా, ఈ ధోరణికి సంబంధించిన ఓ వీడియో బాగా వైరల్ అవులోంది.
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా(Noida)లో ఓ కార్యాలయ ఉద్యోగులు మహిళా బాస్ వద్దని పురుష మేనేజరే కావాలని అన్నారు. మహిళా ఉద్యోగులు సైతం బాస్‌గా మహిళ ఉండడానికి మద్దతు ఇవ్వడం లేదు.
Also Read: Gig workers: న్యూఇయర్ వేళ ఝలక్.. దేశవ్యాప్తంగా స్విగ్గీ, జొమాటో, అమెజాన్ డెలివరీ బాయ్స్ సమ్మె
సామాజిక మాధ్యమాల్లో “This or That” ట్రెండ్ నడుస్తోంది. ఇందులో పాల్గొనేవారు రెండు ఆప్షన్ల మధ్య నిలబడతారు. ఉదాహరణకు కాఫీ లేదా టీ, వేసవి లేదా శీతాకాలం.. ఇలా ఏది అంటే ఇష్టమో దాన్ని ఎంచుకోవాలి.
ఈ ట్రెండ్‌లో పాల్గొన్న నోయిడా క్లౌడ్ సైన్స్ ల్యాబ్స్ సంస్థ ఉద్యోగులు మేల్ మేనేజర్, ఫీమేల్ మేనేజర్‌లో ఎవరినో ఒకరిని ఎంచుకోవాల్సి వచ్చింది. దీంతో అందరూ మేల్ మేనేజర్‌నే ఎంచుకోవడం గమనార్హం.
దీంతో మేల్, ఫీమేల్ బాస్‌లపై ఉద్యోగుల్లో ఉన్న అభిప్రాయాల గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నాయకత్వ స్థానాల్లో మహిళలకు సమాన మద్దతు ఎందుకు ఇంకా లభించడం లేదని అనేక మంది ప్రశ్నిస్తున్నారు.
ఈ వీడియోలో మహిళా ఉద్యోగులు కూడా పురుషుడే తమకు మేనేజర్‌గా కావాలని ఎంచుకోవడం ఏంటని చాలా మంది నిలదీస్తున్నారు.