ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ముగ్గురికి ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా ముగ్గురికి ఢిల్లీ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పరువునష్టం దావా కేసులో కోర్టులో గైర్హాజరు అయినందుకుగాను కేజ్రీవాల్, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా, స్వరాజ్ అభియాన్ వ్యవస్థాపకుడు యోగేంద్ర యాదవ్ లకు కోర్టు నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ చేసింది.
Also Read : చెక్ చేశారా? : Paytmలో క్రెడిట్ స్కోరు ఫీచర్
అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ సామర్ విశాల్ మంగళవారం (ఏప్రిల్ 23, 2019) ముగ్గురికి వారెంట్స్ జారీ చేశారు. పరువు నష్టం దావా కేసులో ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ కూడా కోర్టులో విచారణకు హాజరుకానుందుకు ఢిల్లీ కోర్టు సీరియస్ అయింది. దీంతో వీరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఈ కేసుపై బుధవారం కోర్టు విచారించనుంది.
2013లో జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏఏపీ తరపున స్వచ్చంధంగా పార్టీ టికెట్ ఇవ్వాలని అడ్వకేట్ సురేందర్ కుమార్ శర్మ కోరారు. ఎన్నికల్లో పొటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్న శర్మకు సిసోడియా, యాదవ్, ఏఏపీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ పార్టీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. చివరిలో శర్మకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించారు.
బార్, సమాజంలో తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా ఈ ముగ్గురు తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అడ్వకేట్ శర్మ 2013, అక్టోబర్ 14న కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్, సిసోడియా, యాదవ్ లపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారించిన ట్రయల్ కోర్టు విచారణకు హాజరుకావాలంటూ సమన్లు జారీ చేసింది.
Also Read : మీ ఆధార్ కార్డు పోయిందా? : e-Aadhaar డౌన్ లోడ్ చేసుకోండిలా