ఎన్నికల తర్వాతే…ప్రధాని రేసులో లేనన్న ములాయం

ప్రధాని రేసులో తాను లేనని ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సృష్టం చేశారు.

ప్రధాని రేసులో తాను లేనని ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సృష్టం చేశారు.

ప్రధాని రేసులో తాను లేనని ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సృష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ లోని మెయిన్ పురి లోక్ సభ స్థానానికి ఎస్పీ అభ్యర్థిగా సోమవారం (ఏప్రిల్-1,2019) ములాయం సింగ్ నామినేషన్ వేశారు. ములాయం వెంట ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ములాయం సింగ్ మాట్లాడుతూ… తాను ప్రధాని రేస్ లో లేనని తెలిపారు.అయితే ఎస్పీ-బీఎస్పీ కూటమి తరపున ఎవరు ప్రధాన అభ్యర్థి అని ప్రశ్నించగా… మే-23న లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాతే దీని గురించి చర్చించడం మంచిదని సమాధానమిచ్చారు.
Read Also : రాహుల్ హామీ : ఏడాదిలోనే 22లక్షల ఉద్యోగాలు భ‌ర్తీ

నామినేషన్ అనంతరం ర్యాలీ నిర్వహించకపోవడంతో ములాయం మద్దతుదారులు డిసప్పాయింట్ అయ్యారు.దేశంలోనే అత్యంత భారీ మెజార్టీ ములాయం సింగ్ గెలుస్తారని ఈ సందర్భంగా అఖిలేష్ ధీమా వ్యక్తం చేశారు.ములాయం పోటీ చేస్తున్న మెయిన్‌పురి నుంచి కాంగ్రెస్‌, ములాయం సింగ్ సోదరుడు శివపాల్ యాదవ్‌కు చెందిన ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ-లోహియా (పీఎస్‌పీ-ఎల్) తమ అభ్యర్థులను నిలబెట్టలేదు.బీజేపీ కూడా ఇంతవరకూ ములాయంపై అభ్యర్థిని నిలబెట్టలేదు.

1996,2004,2009,2014లో మొత్తంగా నాలుగుసార్లు మెయిన్ పురి లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా ములాయం విజయం సాధించారు.2014లో మెయిన్ పురితో పాటు అజమ్ ఘర్ లో కూడా పోటీచేసి విజయం సాధించిన ములాయం ఆ తర్వాత మెయిన్ పురి స్థానానికి రాజీనామా చేశారు.ములాయం రాజీనామాతో ఆయన మేనల్లుడు తేజ్ ప్రతాప్ సింగ్ ఆ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 
Read Also : 687 కాంగ్రెస్ ఫేస్ బుక్ పేజీలు డిలీట్