సచిన్, కోహ్లీ, ధోనీలు కాదు..భారత్‌లో అత్యంత సంపన్న క్రికెటర్‌ ఇతనే..!!‌

Aryaman Birla Richest Cricketer In India (1)

Aryaman birla richest cricketer In india : భారత్ లో అంత్యంత సంపన్న క్రికెటర్స్ ఎవరు? అని అడిగితే ఠక్కున చెప్పే పేర్లు సచిన్ టెండుల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ. కానీ వీళ్లెవరూ కాదు. అంటే నమ్మలేం. మరి అంత సంపన్న క్రికెటర్ ఎవరబ్బా? అని ఆలోచించేస్తున్నారా? అతనే ప్రముఖ వ్యాపారం దిగ్గజం కుమార్ మంగళం బిర్లా ముద్దుల తనయుడు ఆర్యమన్ బిర్లా..!!

భారత దేశవాళి క్రికెట్‌లో ప్రాతినిధ్యం వహిస్తు..మధ్యప్రదేశ్‌ జట్టు తరపున రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. 2018లో ఐపీఎల్‌ వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఇతడిని రూ. 31 లక్షలకు కొనుక్కుంది. కుమార్ మంగళం బిర్లా ప్రస్తుత ఆస్తుల విలువ 70 వేల కోట్లు. త్వరలోనే బిర్లా వ్యాపార సామ్రాజ్యానికి ఆర్యమన్ అధిపతి కాబోతున్నాడు. అలా..ఈ లెక్కన చూస్తే భారతదేశంలో అత్యంత సంపన్న క్రికెటర్‌గా పేరు సంపాదించనున్నాడు 23 ఏళ్ల నవ యువకుడు అయిని ఆర్యమన్ బిర్లా…!

ఆర్య‌మన్ బిర్లాకు చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే చాలా ఇష్టం. అంతర్జాతీయ క్రికెటర్‌గా మంచి గుర్తింపు సంపాదించాలని కోరిక. దాని కోసం ప్రతిరోజూ కష్టపడుతున్నాడు. అంతర్జాతీయ క్రికెటర్ల లిస్టులో తన పేరుని చూసుకోవడానికి కఠినమైన ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నాడు. ఆర్యమన్‌ క్రికెట్ స్టైల్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మాన్. లెఫ్ట్ ఆర్మ్ఆర్థోడాక్స్ బౌలర్ కూడా. అంటే ఆల్ రౌండర్ అన్నమాట.

బిర్లా అంటే ఓ బ్రాండ్. దీంతో బిర్లా అనే ఇంటి పేరు వల్ల ఏమైనా ఒత్తిడి ఉంటుందా? అని ఆర్యమన్ ను ఎవరైనా అడిగితే..సమాధానం ఏమని చెబుతాడో తెలుసా.. ‘నేను నా ఇంటి పేరుతో కాదు అంటే నా తండ్రి పేరుతో కాదు నా స్వశక్తితో ఎదగాలనుకుంటున్నా..నా ప్రాధాన్యతనిస్తా నా స్వశక్తిమీదేనంటాడీ నవ యువ బిర్లా…

2017న ఇండోర్‌లో మధ్యప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆర్యమన్ ఫస్ట్‌ క్లాస్ మ్యాచ్‌లో ఒడిశాపై 22 పరుగులు చేశాడు. చేసింది తక్కువ పరుగులే అయినా మంచి అనుభవం సంపాదించానంటాడు ఆర్యమన్. ఆ తరువాత సీ.కే.నాయుడు ట్రోఫీలో 11 ఇన్నింగ్స్‌లలో ఆరు మ్యాచ్‌లు ఆడి 79.50 సగటుతో 795 పరుగులు చేశాడు. ఇక జూనియర్ స్థాయిలో మధ్యప్రదేశ్‌కు ఆడిన ఆర్యమన్‌ నాలుగు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీలు కూడా సాధించాడు. అంటే కష్టపడి పైకి రావాలని ఆర్యమన్ కోరిక నెరవేరాలని..తన తండ్రి పేరుతో కాకుండా స్వశక్తితో పేరు తెచ్చుకోవాలనుకునే ఈ జూనియర్ బిర్లా శ్రమ..ఆశయం ఫలిస్తే మరో చక్కటి ఆటగాడు మన భారత్ టీమ్ లో మెరుపులు మెరిపించొచ్చు..